- Telugu News Photo Gallery Cinema photos Bollywood beauty Rasha Thadani now trending in social media with a single movie name is azaad
Rasha Thadani: బీటౌన్‌లో ట్రెండింగ్ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్
హీరోయిన్లుగా పరిచయం అయిన స్టార్ కిడ్స్‌కు ఇన్‌స్టాంట్‌గా క్రేజ్ రావటం అన్నది చాలా అరుదు. శ్రీదేవి కూతురిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌కు కూడా అంత బజ్ రాలేదు. కానీ ఓ స్టార్ వారసురాలు మాత్రం ఈ రూల్‌ను చేంజ్ చేస్తున్నారు. తొలి సినిమాతోనే బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారి, కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
Updated on: May 06, 2025 | 6:24 PM

90స్‌లో సిల్వర్ స్క్రీన్‌ను రూల్ చేసిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టండన్. బంగారు బుల్లోడు, ఆకాశవీదిలో లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన ఈ బ్యూటీ, నార్త్‌లో టాప్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఇప్పుడు ఈ బ్యూటీ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు రాషా తడాని. ఆజాద్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు రాషా. అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పర్ఫెమ్ చేయలేదు.

అందుకే ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన అమన్ పేరు ఇండస్ట్రీలో ఎక్కడా వినిపించటం లేదు. ఆజాద్ హీరోను జనం పట్టించుకోకపోయినా... ఆ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాషా తడాని మాత్రం టాక్ ఆఫ్ ది బీటౌన్‌గా మారారు.

ముఖ్యంగా రాషా డ్యాన్స్ మూవ్స్‌కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఉయ్ అమ్మా పాటలో రాషా స్టెప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా రాషా జోరు నెక్ట్స్ లెవల్‌లో ఉంది.

గ్లామర్ షోతో పాటు ఫ్యాషన్ ట్రెండ్స్‌లోనూ కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నారు ఈ క్యూటీ. దీంతో రాషా త్వరలోనే స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.




