Bangarraju Trailer: ‘వాసి వాడి తస్సాదియ్యా’.. ఆకట్టుకుంటున్న ‘బంగార్రాజు’ ట్రైలర్..
కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Bangarraju : కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే చైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తుండగా.. నాగ్ సరసన రమ్యకృష్ణ నోటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకేక్కిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బంగార్రాజు సినిమా దానికి సీక్వెల్ గా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కాకానుకగా విడుద చేస్తామని మామొదటి నుంచి చిత్రయూనిట్ చెప్తూ వస్తున్న అనుకున్నట్టుగానే సినిమాను జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ‘చూపులతోనే ఊచకోత కోసేస్తాడు’ అంటూ అమ్మాయిలతో సరసాలు ఆడే బంగార్రాజు పాత్రని పరిచయం చేయడంతో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక కనిపించిన అమ్మాయిలకు బుట్టలోవేసుకునే పాత్రలో చైతన్య కనిపించారు. ఈ సినిమలో నాగార్జున , రమ్యకృష్ణ ఇద్దరు ఆత్మలుగా క్కనిపించనున్నారని తెలుస్తుంది. తన మనవడికి వచ్చిన సమస్య ను పరిష్కరించడానికి బంగార్రాజు భూమిమీదకు వచ్చాడని తెలుస్తుంది. అలాగే తనకన్నా తెలివైన చదువుకున్న అమ్మాయి లేరని భావించే నాగలక్షిగా కృతిసెట్టి అలరించింది. అయితే తనకన్నా తింగరిది తెలివి తక్కువ – మందబుద్ది దద్దమ్మ ఈ ఊర్లోనే లేదంటూ నాగలక్షిని టీజ్ చేస్తున్న చిన బంగార్రాజు.. చివరకు ఆమెతోనే ప్రేమలో పడ్డాడు ఇవన్నీ ట్రైలర్ లో చూపించారు. ఇందులో నాగబాబు – చలపతి రావు – రావు రమేష్ – బ్రహ్మాజీ – వెన్నెల కిషోర్ – ఝాన్సీ – ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :