Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఓ కల్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఎవరో గుర్తుపట్టారా..?

తమ అభిమాన స్టార్స్ చిన్ననాటి ఫోటోలపై ఫ్యాన్స్ భలే ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇంతకుముందు అంటే పేపర్ లో ఫోటోలు వస్తే కట్ చేసి దాచిపెట్టుకునేవారు.

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఓ కల్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఎవరో గుర్తుపట్టారా..?
Heroine Childhood Pic
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 12, 2022 | 7:19 AM

తమ అభిమాన స్టార్స్ చిన్ననాటి ఫోటోలపై ఫ్యాన్స్ భలే ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇంతకుముందు అంటే పేపర్ లో ఫోటోలు వస్తే కట్ చేసి దాచిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ట్రెండ్ పెరగడంతో.. అన్నీ ఆన్ లైన్ లోనే లభిస్తున్నాయి. ఇక సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ కోసం తమ త్రోబ్యాక్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. లక్షల్లో లైకులు, షేర్లు వచ్చి పడుతుంటాయి. ఇదే కోవలో తాజాగా ఓ టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్‌కు సంబంధించిన చైల్డ్‌హుడ్ పిక్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈమె తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ మూవీగా చెబుతోన్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఏంటి, గుర్తు పట్టడం కష్టంగా ఉందా..? అయితే మేమే చెప్పేస్తాం. ఈ ఫోటోలో ఉంది ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలిని పాండే.

షాలిని పాండే 1993, సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని, జబల్ పూర్‌లో జన్మించింది. ఈమె జబల్ పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 2017లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తరువాత ‘మహానటి’, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్ధం చిత్రాల్లో మెరిసింది. ఎన్.టి.ఆర్. కథానాయకుడులో షావుకారు జానకి గా కనిపించింది . హిందీలో ‘మేరి నిమ్ము’ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. తమిళంలో 100 పర్శంట్ కాదల్, గోరిల్లా, సైలెన్స్ చిత్రాల్లో నటించింది. 2018లో ‘నా ప్రాణమయ్’ పాట కోసం స్వరాన్ని అందించింది. కాగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి ఉత్తమ నటి అవార్డు అందుకుంది షాలిని పాండే. కానీ ఎందుకో తెలుగులో ఈ అందాల రాశికి సరైన పాత్రలు పడటం లేదు.

View this post on Instagram

A post shared by Shalini (@shalzp)

Also Read: Telangana: ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపిన CRPF జవాన్.. ఏం జరిగిందంటే