సినిమాతారలను వదలని మహమ్మారి.. వరుసగా కరోనా బారిన పడుతున్న మూవీ స్టార్స్.. ఆందోళనలో అభిమానులు

కరోనా మహమ్మారి సామాన్యులనుంచి సెలబ్రెటీల వరకు అందరిని  గురిచేస్తుంది. ఎన్ని  జాగ్రత్తలు తీసుకున్న కరోనా మహమ్మారి సోకకుండా వదలడం లేదు.

సినిమాతారలను వదలని మహమ్మారి.. వరుసగా కరోనా బారిన పడుతున్న మూవీ స్టార్స్.. ఆందోళనలో అభిమానులు
Covid
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 11, 2022 | 3:38 PM

కరోనా మహమ్మారి సామాన్యులనుంచి సెలబ్రెటీల వరకు అందరిని  గురిచేస్తుంది. ఎన్ని  జాగ్రత్తలు తీసుకున్న కరోనా మహమ్మారి సోకకుండా వదలడం లేదు. గత రెండు వేవ్ లనుంచి తప్పించుకున్నవారు ఇప్పుడు థర్డ్ కాటుకు గురవుతున్నారు. ఇక సినిమా తారలు వరుసగా కరోనా బారిన పడటం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తుంది. టాలీవుడ్ బాలీవుడ్ అని తేడాలేకుండా సినిమాతారలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలివుడ్ లో మహేష్ బాబు, త్రిష, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు.అలాగే సీనియర్ హీరోయిన్లు శోభన, మీనా కుటుంబం , కుష్భు, మంచు మనోజ్ మంచు లక్ష్మీ కూడా ఈ వైరాస్ బారినపడ్డారు.  రీసెంట్ గా రేణు దేశాయ్ ఆమె కుమారుడు అకీరా నందన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. అటు బాలీవుడ్ లోను కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.

ఇక నటుడు సత్యరాజ్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన… చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.  తాజాగా ఆయన కుమారుడు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ కరోనా నుంచి సత్య రాజ్ కోలుకున్నారని తెలిపాడు.  దాంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Assembly Elections 2022: రాజస్థాన్ రాజకీయ నేతల భవిష్యత్ నిర్ణయించనున్న 5 రాష్ట్రాల ఎన్నికలు..?

UP Assembly Elections: ఇవాళ ఢిల్లీలో బీజేపీ కీలక భేటీ.. యూపీ అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు!