Pushpa: అల్లు అర్జున్ నిజంగా అదరగొట్టేశాడు .. పుష్ప సినిమా పై తమిళ్ స్టార్ హీరో కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని చేసుకున్న విషయం తెలిసిందే.

Pushpa: అల్లు అర్జున్ నిజంగా అదరగొట్టేశాడు .. పుష్ప సినిమా పై తమిళ్ స్టార్ హీరో కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 12, 2022 | 3:43 PM

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మొదటి పార్ట్ కే విపరీతమైన రెస్పాన్స్ రావడంతో పార్ట్ 2 పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా నటించి ఆకట్టుకున్నాడు. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో విపరీతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది పుష్ప. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీ నటనకు విమర్శకుల ప్రసంశలు దక్కుతున్నాయి.

ఇక సినిమా తారలు కూడా బన్నీ నటనను తెగ పొగిడేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా బన్నీ సినిమాను తెగమెచ్చుకుంది. తాజాగా తమిళ్ స్టార్ హీరో కార్తీ కూడా పుష్ప సినిమా పై ప్రసంశలు కురిపించాడు. “బన్నీ పూర్తిగా ‘పుష్ప’గా మారిపోయాడు. ఆ పాత్రలోకి ఆయన జీవించేశాడు.  నిజంగా బన్నీ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. ఇక సుకుమార్  గారి విషయానికి వస్తే, ఆయన ప్రెజెంటేషన్ ఒక రేంజ్ లో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా చేశారు. తమకి అప్పగించిన పనికి న్యాయం చేశారు” అంటూ సోషల్ మీడియా వేదికగా కార్తీ చెప్పుకొచ్చాడు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై అల్లు అర్జున్ స్పందిస్తూ.. థ్యాంక్స్ చెప్పారు. ఇక పుష్ప సినిమా ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ లో కూడా అత్యధిక వ్యూస్ రాబడుతూ.. రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది పుష్ప.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సినిమాతారలను వదలని మహమ్మారి.. వరుసగా కరోనా బారిన పడుతున్న మూవీ స్టార్స్.. ఆందోళనలో అభిమానులు

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఓ కల్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఎవరో గుర్తుపట్టారా..?

Kiren Rijiju: అతనిది నీచమైన మనస్తత్వం.. సిద్ధార్థ్‌ అసభ్యకర వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్..