Kiren Rijiju: అతనిది నీచమైన మనస్తత్వం.. సిద్ధార్థ్ అసభ్యకర వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్..
Kiren Rijiju on Siddharth: బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై నటుడు సిద్ధార్థ్ చేసిన అసభ్యకర ట్విట్‌పై పలువురు
Kiren Rijiju on Siddharth: బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై నటుడు సిద్ధార్థ్ చేసిన అసభ్యకర ట్విట్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే సిద్ధార్ద్ చేసిన ట్విట్‌ను డిలీట్ చేయాలని.. అతనిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమీషన్ డిమాండ్ చేసింది. పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా ఉల్లంఘనలపై సైనా నెహ్వాల్ ఆందోళన వ్యక్తం చేసింది. కాన్వాయ్ వెళ్లే రూట్‌లో నిరసనల కారణంగా 20 నిమిషాల పాటు ప్రధాని కాన్వాయ్ ఫ్లైఓవర్‌పై వేచి ఉండాల్సి వచ్చిందని.. ఇది సమంజసం కాదంటూ ట్విట్‌లో తెలిపింది. ప్రధాని భద్రతకు విఘాతం కలిగిస్తే ఏ దేశం కూడా సురక్షితంగా ఉందని చెప్పుకోదంటూ పేర్కొంది. దీనికి నటుడు సిద్ధార్థ్ స్పందించాడు. ‘సబ్టిల్ కాక్ చాంపియన్ ఆఫ్ వరల్డ్… గాడ్ థ్యాంక్స్.. గాడ్ ఆఫ్ ఇండియా ప్రొటెక్టర్స్ చేతులు ముడుచుకున్నారంటూ సిగ్గుపడాలి’ అంటూ సిద్ధార్థ్ పేర్కొన్నాడు. అనంతరం ఈ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సిద్ధార్థ్ పై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా.. సిద్ధార్థ్ చేసిన ట్విట్ పై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. అలాంటి వ్యాఖ్యలు వ్యక్తి “అవివేక మనస్తత్వాన్ని” చూపుతాయంటూ ఆయన వ్యాఖ్యానించారు.
భారతదేశాన్ని క్రీడా శక్తిగా మార్చడంలో నెహ్వాల్ చేసిన విశేష కృషికి భారతదేశం మొత్తం గర్విస్తోందని రిజిజు వ్యాఖ్యానించారు. “ఆమె ఒలింపిక్ పతక విజేత కాకుండా దృఢమైన దేశభక్తురాలు. అలాంటి ఐకాన్ పర్సనాలిటీపై చౌకబారు వ్యాఖ్య చేయడం ఒక వ్యక్తి నీచమైన మనస్తత్వాన్ని వర్ణిస్తుంది” అంటూ కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో రాశారు.
India is proud of @NSaina for her outstanding contributions in making India a sporting powerhouse. She is a steadfast patriot besides being an Olympic medalist ?? Making a cheap comment on such an icon personality depics a person’s ignoble mentality. https://t.co/L4yV3xdRuh
— Kiren Rijiju (@KirenRijiju) January 11, 2022
కాగా.. ఈ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో సిద్ధార్థ్ స్పందించాడు. సైనా నెహ్వాల్‌ను అగౌరవంగా ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయలేదంటూ సిద్ధార్ద్ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. కాగా.. సిద్ధార్థ్ చేసిన ట్విట్‌పై పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: