AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 Trailer: పుష్ప 2 ట్రైలర్ పై బండ్లన్న రివ్యూ.. అల్లు అర్జున్ గురించి ఏమన్నాడంటే?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'తో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం(నవంబర్ 17) సాయంత్రం విడుదలైంది. బీహార్‌లోని పాట్నాలో జరిగిన 'పుష్ప 2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు.

Pushpa 2 Trailer: పుష్ప 2 ట్రైలర్ పై బండ్లన్న రివ్యూ.. అల్లు అర్జున్ గురించి ఏమన్నాడంటే?
Bandla Ganesh, Allu Arjun
Basha Shek
|

Updated on: Nov 17, 2024 | 7:47 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తోన్నతరుణం రానే వచ్చింది. బన్నీ నటించిన పుష్ప 2 ది రూల్ ట్రైలర్ వచ్చేసింది. బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానం వేదికగా పుష్ప 2 ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సుమారు 2నిమిషాల 44 సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్ సినిమా పై అంచనాలను నెక్ట్స్ లెవెల్ కు తీసుకొచ్చింది. ఈ ట్రైలర్ ను చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. పుష్ప 1 కు మించి ఈ సినిమా ఉంటుందంటూ అప్పుడే కలెక్షన్లు కూడా చెప్పేస్తున్నారు. తాజాగా పుష్ఫ 2 ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వీక్షించారు. అనంతరం తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘పుష్ప-2 ట్రైలర్ నిజంగా ఒక మాస్టర్‌పీస్. అల్లు అర్జున్ మరోసారి తన ట్యాలెంట్‌ను నిరూపించుకున్నాడు. 100 శాతం తన బెస్ట్ ఇచ్చారు. బన్నీ స్టైల్, యాటిట్యూడ్ అండ్ పర్ఫామెన్స్ అన్నీ అద్భుతం. అతనిలా ఇంకెవరూ చేయలేరు. నిజంగా అల్లు అర్జున్ ఒక మాస్ కింగ్. తగ్గేదే లే’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బన్నీ అభిమానులు బండ్లన్నను ప్రశంసలతో ముంచెత్తున్నారు.

కాగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహాద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు, రావు రమేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్ చేసింది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అన్నీ భారీగా హైప్ పెంచేశాయి. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్‌తో అభిమానుల అంచనాలు నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయాయి.

Bandla Ganesh, Allu Arjun 1

Bandla Ganesh, Allu Arjun 1

పుష్ప 2 ట్రైలర్..

ఇవి కూడా చదవండి

పుష్ప 2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us