- Telugu News Photo Gallery Cinema photos Ranveer Singh Does Not Have Right Face To Play Shaktimaan says Mukesh Khanna
Shaktimaan: వివాదంలో ఇండియన్ సూపర్ హీరో శక్తి మాన్
శక్తి మాన్ ను రీ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తున్న బాలీవుడ్ మేకర్స్, కొత్త రచ్చకు తెర లేపారు. ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా ఇండియన్ సూపర్ స్టార్‌ను మళ్లీ తెర మీద చూపించాలనుకున్న చిత్రయూనిట్‌కు తిప్పలు తప్పటం లేదు. ఇంతకీ ప్రాబ్లమ్ ఏంటి అనుకుంటున్నారా..; అయితే వాచ్ దిస్ స్టోరి.
Updated on: Nov 17, 2024 | 8:15 PM

శక్తి మాన్ ను రీ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తున్న బాలీవుడ్ మేకర్స్, కొత్త రచ్చకు తెర లేపారు. ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా ఇండియన్ సూపర్ స్టార్‌ను మళ్లీ తెర మీద చూపించాలనుకున్న చిత్రయూనిట్‌కు తిప్పలు తప్పటం లేదు. ఇంతకీ ప్రాబ్లమ్ ఏంటి అనుకుంటున్నారా..; అయితే వాచ్ దిస్ స్టోరి.

80స్, 90స్‌లో టీవీ సీరియల్స్ చూసిన వాళ్లకు బాగా పరిచయం ఉన్న సూపర్ హీరో క్యారెక్టర్ శక్తిమాన్. బుల్లితెర మీద ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఈ క్యారెక్టర్‌ను ఇప్పుడున్న టెక్నాలజీతో గ్రాండ్‌గా వెండితెర మీద ఆవిష్కరించేందుకు ట్రై చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్.

రణవీర్ సింగ్ హీరోగా శక్తి మాన్ సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఓల్డ్ శక్తి మాన్ ముఖేష్ ఖన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రణవీర్ ఇమేజ్ శక్తి మాన్ క్యారెక్టర్‌కు సూట్ అవ్వదంటూ ముఖేష్ చేసిన కామెంట్స్ వివాదానికి తెరలేపాయి. ఆ తరువాత ముఖేష్ సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా... రణవీర్ ఫ్యాన్స్ మాత్రం కూల్ అవ్వటం లేదు.

రణవీర్ విషయంలోనే కాదు మరో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ విషయంలోనూ ఇలాంటి కామెంట్సే చేశారు ముఖేష్ ఖన్నా. ఆల్రెడీ ఏ ఫ్లైయింగ్ జాట్ సినిమాలో సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించిన టైగర్ పేరు కూడా శక్తి మాన్ మూవీ విషయంలో వినిపించింది. అయితే ముఖేష్ మాత్రం టైగర్ కూడా ఆ పాత్రకు సరిపోడంటున్నారు. శక్తి మాన్ బ్రెయిన్ లెస్ క్యారెక్టర్ కాదు టైగర్ ఆ పాత్రలో నటించడానికి అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.

శక్తి మాన్ హక్కులు ప్రస్తుతానికి ఎవరికీ ఇవ్వలేదన్న ముఖేష్ ఖన్నా... త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి క్లారిటీ ఇస్తానంటున్నారు. ఏ హీరోను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదంటునే, యంగ్ జనరేషన్ హీరలో మీద సెటైర్స్ వేశారు.




