AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna Movie : ఉగాది రోజున BB3 అఫీషియల్‌ టైటిల్‌..? ఇక బాలకృష్ణ ఫ్యాన్స్‌కి పండగే.. చూసుకోండి..!

Balakrishna Movie Title : ఉగాది పండుగ రోజున బాలకృష్ణ నటిస్తున్న BB3 మూవీ అఫీషియల్‌ టైటిల్‌ను చిత్ర యూనిట్‌ కరారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. బాలకృష్ణ కథానాయకుడిగా

Balakrishna Movie : ఉగాది రోజున BB3 అఫీషియల్‌ టైటిల్‌..? ఇక బాలకృష్ణ ఫ్యాన్స్‌కి పండగే.. చూసుకోండి..!
Bb3
uppula Raju
|

Updated on: Apr 10, 2021 | 5:34 AM

Share

Balakrishna Movie Title : ఉగాది పండుగ రోజున బాలకృష్ణ నటిస్తున్న BB3 మూవీ అఫీషియల్‌ టైటిల్‌ను చిత్ర యూనిట్‌ కరారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. అయితే ఇప్పటికే సినిమాకి సంబంధించిన టైటిల్‌పై సామాజిక మాధ్యమాల్లో రెండు మూడు పేర్లు బయటకు వచ్చాయి.

వాటిలో ఒకదానిని ఖరారు చేస్తారా? లేదా వేరే టైటిల్స్ పెడతారా? అనే విషయం తెలియాలంటే ఉగాది వరకు వేచి చూడక తప్పదు. ప్రస్తుతం ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘బీబీ3’ వర్కింగ్‌ టైటిల్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నటి పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు.

ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే కన్ఫామ్ అయ్యింది. బాలకృష్ణ – బోయపాటి శ్రీను గతంలో ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి మాస్ బ్లాక్‌బాస్టర్ మూవీస్ వచ్చాయి. తాజాగా రూపొందుతున్న ‘బీబీ-3’ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ బాలయ్య బాబులోని నట విశ్వరూపాన్ని చూపించాయి. బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

తొలిపోరులో బోణీ కొట్టిన కోహ్లీసేన.. చివరి బంతి వరకు ఉత్కంఠ.. ముంబై ఇండియన్స్‌పై బెంగుళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ గెలుపు..

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది..

Follow Us