Online Gaming Rules: ఆన్‌లైన్ గేమింగ్‌కు కొత్త నిబంధనలు.. మే 1 నుంచి అమలు..!
Online Gaming Rules: ఈ కొత్త నిబంధనలు ఆన్‌లైన్ గేమింగ్‌లో పారదర్శకతను పెంచడంతో పాటు, ముఖ్యంగా యువ, పిల్లలు గేమింగ్ వ్యసనానికి గురికాకుండా, ఆర్థికంగా నష్టపోకుండా రక్షణ కల్పిస్తాయి. మే 1 నుండి గేమింగ్ కంపెనీలు ఈ నిబంధనలను తూచా తప్పకుండా..

Online Gaming Rules: భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ‘ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్’ కింద రూపొందించిన కొత్త నిబంధనలు మే 1, 2026 నుండి అమలులోకి రానున్నాయి. దీనివల్ల డ్రీమ్11, వింజో, ఎంపీఎల్ వంటి రియల్ మనీ గేమింగ్ యాప్స్ పై ప్రభావం పడనుంది.
రియల్ మనీ గేమ్స్ అంటే ఏమిటి? రిజిస్ట్రేషన్ ఎవరికి అవసరం?
ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపిన వివరాల ప్రకారం.. డబ్బుతో సంబంధం లేని గేమ్స్: మీరు ఆడే ఆటలో ఎటువంటి డబ్బు లావాదేవీలు (Fees) లేకపోతే, వాటికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
రియల్ మనీ గేమ్స్: ఆటలో ఏ స్థాయిలోనైనా డబ్బు డిపాజిట్ చేయడం, నగదు గెలుచుకునే అవకాశం ఉండటం లేదా గేమ్ లోని ఆస్తులను బయట డబ్బుగా మార్చుకునే వీలుంటే వాటిని ‘రియల్ మనీ గేమ్స్’గా పరిగణిస్తారు. వీటికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ-స్పోర్ట్స్ (E-sports): వీటికి కూడా రిజిస్ట్రేషన్ కచ్చితంగా ఉండాలి.
ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (OGAI): ఈ కొత్త సంస్థ సెక్టార్ రెగ్యులేటర్‌గా పనిచేస్తుంది. ఏదైనా గేమ్ ఏ కేటగిరీలోకి వస్తుందో నిర్ణయించడం, ఫిర్యాదులను పరిష్కరించడం, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించే అధికారం ఈ అథారిటీకి ఉంటుంది.
ఇది కూడా చదవండి: వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట.. సర్వేలో షాకింగ్ నిజాలు..!
బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేల బాధ్యత: ఏదైనా గేమింగ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేసే ముందు, ఆ గేమ్ యొక్క రెగ్యులేటరీ స్టేటస్‌ను బ్యాంకులు తనిఖీ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పేమెంట్లను నిలిపివేయాల్సి ఉంటుంది.
డేటా లోకలైజేషన్: గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ ట్రాఫిక్ మరియు యూజర్ల డేటాను భారతదేశంలోనే స్టోర్ చేయాలి. విదేశీ సర్వర్లలో దాచడానికి వీల్లేదు.
యూజర్ సేఫ్టీ (భద్రత): వయస్సు నిర్ధారణ (Age-gating), సమయ పరిమితులు విధించాలి. తల్లిదండ్రుల నియంత్రణ సౌకర్యం ఉండాలి. ఫిర్యాదుల పరిష్కారానికి అంతర్గత వ్యవస్థ ఉండాలి.
ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
ఫిర్యాదుల పరిష్కారం:
యూజర్లకు ఏవైనా సమస్యలు ఎదురైతే ముందుగా గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం లభించకపోతే OGAIని ఆశ్రయించవచ్చు. ఇంకా సంతృప్తి చెందకపోతే ప్రభుత్వ అప్పీలేట్ అథారిటీకి వెళ్లే అవకాశం కూడా కల్పించారు.
ఈ కొత్త నిబంధనలు ఆన్‌లైన్ గేమింగ్‌లో పారదర్శకతను పెంచడంతో పాటు, ముఖ్యంగా యువ, పిల్లలు గేమింగ్ వ్యసనానికి గురికాకుండా, ఆర్థికంగా నష్టపోకుండా రక్షణ కల్పిస్తాయి. మే 1 నుండి గేమింగ్ కంపెనీలు ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Business Idea: రూ. 10 పెట్టుబడి.. రూ. 90 లాభం.. గాజుల వ్యాపారంతో కాసుల వర్షం – టాప్ 5 బిజినెస్ ఐడియాలు ఇవే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




