AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాఫీ వ్యక్తిగా మారిన కాజల్‌ అగర్వాల్‌..! గ్రీన్‌ టీ నుంచి అటువైపు ఎందుకు మళ్లిందో తెలుసా..?

Kajal Aggarwal : పలు భాషల్లో సినిమాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపుతెచ్చుకుంది నటి కాజల్‌ అగర్వాల్.. ఇటీవల పెళ్లి కూడా చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. భర్త గౌతమ్

కాఫీ వ్యక్తిగా మారిన కాజల్‌ అగర్వాల్‌..! గ్రీన్‌ టీ నుంచి అటువైపు ఎందుకు మళ్లిందో తెలుసా..?
Kajal Aggarwal
uppula Raju
|

Updated on: Apr 10, 2021 | 5:35 AM

Share

Kajal Aggarwal : పలు భాషల్లో సినిమాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపుతెచ్చుకుంది నటి కాజల్‌ అగర్వాల్.. ఇటీవల పెళ్లి కూడా చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. భర్త గౌతమ్ కిచ్లుతో సరదాగా గడుపుతోంది. ఇదిలా ఉంటే కాజల్‌ అగర్వాల్ గతంలో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొని అభిమానులతో పలు విషయాలన షేర్ చేసుకుంది. అందులో భాగంగా తనకు గ్రీన్‌ టీ తాగడమంటే చాలా ఇష్టమని, టీ, కాఫీల జోలికి తాను వెళ్లనని చెప్పింది. అయితే ఆమె ఇటీవల గ్రీన్‌ టీ నుంచి కాఫీ వైపునకు మళ్లింది. అందుకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

అంతేకాకుండా భర్త గౌతమ్ కిచ్లుకు ధన్యవాదాలు తెలుపుతూ కామెంట్ పెట్టింది. అందులో ఏముందంటే తన భర్త తనని నెమ్మదిగా కాఫీ వ్యక్తిగా మారుస్తున్నాడని అది తనకు బాగా నచ్చిందని తెలిపింది. అదే విషయాన్ని తెలియజేస్తూ.. ఓ కాఫీ గ్లాస్‌, పక్కన చాక్లెట్‌ ముక్కలు, కళ్లజోడు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా భర్తతో కలిసి ఇటీవల ఇంట్లో సంబరాలు చేసుకున్న ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి.

డోంట్ రష్ ఛాలెంజ్‌లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ ఓ వీడియోను కూడా అప్‌లోడ్‌ చేసింది ఈ అమ్మడు. ఈ వీడియోలో ఆమె తన పాఠశాల రోజులను గుర్తు చేసుకుంది. కాజల్‌ అగర్వాల్ మార్చి 19 న విడుదలైన మోసగాళ్లు అనే చిత్రంలో చివరిసారి కనిపించింది. ఈ సినిమా డబ్బు, ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కింది. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందింది. కాజల్‌ ఇంకా హే సినామిక, ఆచార్య, ఇండియన్ 2, ఘోస్టీ చిత్రాల్లో నటిస్తుంది. పారిస్ పారిస్ పేరుతో కంగనా రనౌత్ చిత్రం క్వీన్ తమిళ రీమేక్‌లో కూడా ఆమె నటించనుంది.

తొలిపోరులో బోణీ కొట్టిన కోహ్లీసేన.. చివరి బంతి వరకు ఉత్కంఠ.. ముంబై ఇండియన్స్‌పై బెంగుళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ గెలుపు..

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది..

Follow Us