AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajashekhar: ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడ్డా..! మంచి హిట్ అయ్యింది

నటుడు రాజశేఖర్ తన కెరీర్, వ్యక్తిగత జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలపై ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తన బహిరంగ స్వభావం, రెమ్యూనరేషన్ విధానం, నత్తి సమస్య, అలాగే తన చిత్రాలకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పిన వైనం వంటి విషయాలను పంచుకున్నారు. రాజశేఖర్ తనను తాను ఒక చిన్న పిల్లాడిలాగే భావిస్తానని, ఓపెన్ గా మాట్లాడటం వల్ల అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతాయని అన్నారు.

Rajashekhar: ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడ్డా..! మంచి హిట్ అయ్యింది
Rajasekhar
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2026 | 8:35 AM

Share

నటుడు రాజశేఖర్ ఒకానొక సమయంలో హీరోగా రాణించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రాజశేఖర్. ఇక ఇప్పుడు రూట్ మార్చి సహాయక  పాత్రలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ మధ్య నితిన్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు.. ఇక రీసెంట్ గా శర్వానంద్ నటించిన బైకర్ సినిమాలో హారో తండ్రి పాత్రలో మెప్పించారు ఈ సినిమా మంచివిజయాన్ని అందుకున్నారు. అయితే రాజశేఖర్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ అయ్యాను అని తెలిపారు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌లో పలు విజయవంతమైన చిత్రాలను వదులుకున్నట్లు తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు.

చిరంజీవి నటించిన ఠాగూర్, వెంకటేష్ నటించిన చంటి, అలాగే జెంటిల్మాన్ వంటి భారీ విజయాలు సాధించిన సినిమాలను తాను మిస్ చేసుకున్నానని ఆయన పేర్కొన్నారు. తాను వదులుకున్న సినిమాలలో ఏవి హిట్ అయ్యాయన్న ప్రశ్నకు సమాధానంగా, చాలా సినిమాలు ఉన్నాయని రాజశేఖర్ తెలిపారు. కొన్ని కారణాల వల్ల తాను ఆ సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా చంటి సినిమా గురించి వివరిస్తూ, మొదట తాను ఆ సినిమాను చూడాలనుకున్నానని, మరుసటి రోజు ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ రావాలని అనుకున్నానని తెలిపారు.

అయితే, దర్శకుడు వాసు తనకు అంతగా సూట్ అవ్వకపోవచ్చని ఎవరో చెప్పడంతో పాటు, ఉదయాన్నే షూటింగ్ ఉండటంతో తాను ఆ సినిమా చూడకుండానే వచ్చేశానని వివరించారు. తర్వాత వెంకటేష్ నటించిన చంటి సినిమా చూసినప్పుడు చాలా పశ్చాత్తాపపడ్డానని రాజశేఖర్ అన్నారు. ఆ సినిమాను తాను చూసి ఉంటే, వదులుకునేవాడిని కాదని, దాన్ని కొనుగోలు చేయడానికి పోటీ పడేవాడినని ఆయన తెలిపారు. ఇక ఇప్పుడు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే సహాయక పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని ఇటీవలే తెలిపారు రాజశేఖర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది