Balakrishna: అభిమాని గృహప్రవేశానికి వెళ్లిన బాలయ్య.. పిల్లలతో సరదాగా ముచ్చట్లు.. వీడియో చూశారా?
నందమూరి నట సింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎక్కడ కనిపించినా ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ పడుతుంటారు. అలాగే కనీసం ఒక్కసారైనా బాలయ్యతో మాట్లాడేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే తన అభిమానులకు ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు బాలయ్య.
నందమూరి నట సింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎక్కడ కనిపించినా ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ పడుతుంటారు. అలాగే కనీసం ఒక్కసారైనా బాలయ్యతో మాట్లాడేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే తన అభిమానులకు ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు బాలయ్య. కొన్ని సార్లు కోప్పడినా, చేయి చేసుకున్నా అభిమానుల పట్ల ప్రేమతో ఉంటారు బాలయ్య. అలా తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారీ స్టార్ హీరో. అంతేకాదు ఏకంగా మూడు గంటల పాటు అక్కడే ఉన్నారట. అభిమాని కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ముచ్చట్లు చెబుతూ సరదాగా గడిపారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ‘మొదట అంతటి గొప్ప నటుడు, హిందుపురం ఎమ్మెల్యే తమ ఇంటికి ఆహ్వానిస్తే వస్తారో.. రారో అని సదరు అభిమాని భావించారట. అయితే బాలయ్య మాత్రం.. సమయం తీసుకుని మరీ అభిమాని ఇంటికి వెళ్లారు. దాదాపు 3 గంటలపాటు గృహప్రవేశం కార్యక్రమంలో సందడి చేశారట.
కాగా బాలయ్య తమ ఇంటికి రావడం పట్ల సదరు అభిమాని ఎంతో ఖుషీగా ఫీలయ్యారు. ఇంతటి గొప్ప నటుడు.. తమ ఇంటికి రావడం నమ్మలేకుండా ఉన్నామని వారు ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. ఇంతటి మంచి మనిషిని తమ జీవితంలో చూడలేదని.. బాలయ్య డౌన్ టూ ఎర్త్ అంటూ కూడా ప్రశంసలతో ముంచెత్తారు. కాగా బాలకృష్ణ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని… దంపతులను ఆశీర్వదించారు. అక్కడే అందరితో కలిసి భోజనాలు కూడా చేశారు. అలాగే ఎంతో ఓపికగా కుటుంబ సభ్యులతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ‘మా బాలయ్య బాబు గోల్డ్ ఎహే’, ‘బాలయ్య మనసు బంగారం’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అభిమాని ఇంట్లో నందమూరి హీరో బాలయ్య.. వీడియో ఇదిగో..
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. NBK 109 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తున్నారు. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.