Balagam Movie: ‘బలగం’ నటి విజయలక్ష్మి జీవితంలో మాటలకందని విషాదం.. భర్త, కొడుకు చనిపోవడంతో..
బలగం సినిమాలో నటించిన ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు దగ్గరైంది. ఇందులో కొమురయ్య చెల్లి పోశవ్వ పాత్రను ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. ఓవైపు అన్న చనిపోయాడని ఏడుస్తూనే అందరినీ ఓ కంట కనిపెడుతూ.. అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలంటూ గొడవలకు కారణమవుతూ ఉంటుంది.
గత కొద్ది రోజులుగా ఎక్కడా చూసిన బలగం సినిమా పేరే వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఓవైపు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ ఈ సినిమా కోసం థియేటర్లకు క్యూకట్టారు ఆడియన్స్. మార్చి 3న రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ అప్పటివరకు ప్రేక్షకులకు అంతగా పరిచయంలేని వారే. ఈ మూవీతో వారందరికీ మంచి గుర్తింపు రావడంతో పాటు.. పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. బలగం సినిమాలో నటించిన ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు దగ్గరైంది. ఇందులో కొమురయ్య చెల్లి పోశవ్వ పాత్రను ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. ఓవైపు అన్న చనిపోయాడని ఏడుస్తూనే అందరినీ ఓ కంట కనిపెడుతూ.. అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలంటూ గొడవలకు కారణమవుతూ ఉంటుంది. ఈ పాత్రలో అద్భుతంగా నటించిన విజయలక్ష్మి జీవితంలో మాటలకందని విషాదం దాగుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తన భర్త చనిపోయిన నాలుగేళ్లకే చిన్న కొడుకు మరణించడంతో జీవితంలో తట్టుకోలేని బాధ అని అన్నారు. “నేను నాటకాలు వేస్తుంటాను. నంది సహా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. హరికథలు కూడా చెప్పేదాన్ని. నేను చేసిన తొలి సినిమా బలగం. ఇది యదార్థంగా జరుగుతున్న కథ. నాకు ఈరోజు ఇంతమంచి పేరు రావడానికి కారణం వేణుగారే. ఈసినిమా సహజంగా రావడానికి ఎంత కష్టపడ్డారనేది నాకు తెలుసు. ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడ్డాం.
నా భర్త చనిపోయాక నా పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నా చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలో అతడి భార్య గర్భవతి. నా జీవితంలో తట్టుకోలేని విషాదమది. అన్ని విధాలుగా తోడుండే భర్త చనిపోవడం.. ఆయన మరణించిన నాలుగేళ్లకు చేతికందిన కొడుకు ఆకస్మా్త్తుగా ప్రాణాలు వదలడంతో ఎంతో బాధపడ్డాను ఆ సంఘటన నుంచి నేనింతవరకు తేరుకోలేకపోతున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు విజయలక్ష్మి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.