Tollywood: అంతఃపురంలో నటించిన ఈ చిన్నోడు.. ఇప్పుడు మ్యాన్లీ లుక్‌లో
సినిమాలో సౌందర్య కొడుకుగా నటించిన కృష్ణప్రదీప్ చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. రెండేళ్ల వయసులో కూడా బుడ్డోడు చాలా బాగా నటించాడు. ముఖ్యంగా సౌందర్య స్పృహ కోల్పోయిన సమయంలో కర్చీఫ్ నీటిలో తడిపి తుడిచే సీన్‌లో మాస్టర్ కృష్ణప్రదీప్ నటనకు ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
కృష్ణవంశీకి క్రియేటివ్ దర్శకుడు అనే పేరుంది. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి సినిమాలు ఇచ్చారు. గులాబీ, నిన్నే పెళ్లాడుతూ, సింధూరం, చంద్రలేఖ, అంత:పురం, సముద్రం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ వంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించాడు. ఆయన తీసిన ఒక్కో సినిమా ఒక్కో క్లాసిక్. ముఖ్యంగా అంతఃపురం సినిమా గురించి మాట్లాడుకోవాలి.
ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సౌందర్య, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా. ఒక్కో పాత్ర ఒక్కో రేంజ్‌లో ఉంటుంది. సినిమాలో నటనకు గానూ.. ఈ సినిమాలో నటనకుగానూ సౌందర్య నటనకు ఏపీ ప్రభుత్వ నంది పురస్కారాన్ని ప్రకటించింది. జగపతి బాబుకు ఉత్తమ సహాయ నటుడి కేటగిరీలో నందిని అందుకున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ నటనగానూ స్పెషల్ మెన్షన్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ దక్కింది. సౌందర్యకు ఉత్తమ నటిగా, కృష్ణవంశీకి బెస్ట్ డైరెక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. ఇలా అద్యత్భుతమైన ఈ సినిమాకు అవార్డుల పంట పండింది. సినిమాకు ఇళయరాజా సంగీతం మరో ప్లెస్. అన్ని క్రాఫ్ట్స్ చక్కగా కుదిరితే సినిమా ఎంత బాగా వస్తుంది అనడానికి అంత:పురం ఓ ఉదాహారణ.
ఇక ఈ సినిమాలో సౌందర్య-సాయి కుమార్ జంట తనయుడిగా నటించిన చిన్నోడు గుర్తున్నాడా..? ఈ చిన్నోడి చుట్టే సినిమా కథ అంతా తిరుగుతూ ఉంటుంది. అ బుడ్డోడి పేరు.. కృష్ణ ప్రదీప్. కేవలం రెండు సంవత్సరాల వయస్సులోనే ఈ బుడ్డోడు నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమాలో సౌందర్య స్పృహ కోల్పోయిన సమయంలో కర్చీఫ్ నీటిలో తడిపి తుడిచే సీన్ నెక్ట్స్ లెవల్. ఆ తర్వాత చదువు నిర్లక్ష్యం కాకూడదని ఈ బుడతడ్ని సినిమాలకు దూరంగా ఉంచారు పేరెంట్స్. ఇప్పుడు అతగాడు హీరో ఫీచర్స్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు. హీరోలకు ధీటుగా మంచి ఫిజిక్‌తో కనిపిస్తున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.