యాంక‌ర్ ర‌ష్మీకి క‌రోనా పాజిటివ్ ‌!

ప్రముఖ యాంకర్, నటి రష్మీకి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

యాంక‌ర్ ర‌ష్మీకి క‌రోనా పాజిటివ్ ‌!
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 22, 2020 | 6:54 PM

ప్రముఖ యాంకర్, నటి రష్మీకి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన ఆరోగ్య పరిస్థితిపై రష్మీ ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. కాగా ఇటీవల కమెడియన్ సుధీర్‌కు కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. షూటింగ్ సెట్లో ఉండగా, అంతకముందు చేయించుకున్న టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ రావడంతో అర్థాంతరంగా వెళ్లిపోయారట.

సుధీర్‌, ర‌ష్మీల‌కు కోవిడ్ సోకడంతో శుక్ర‌వారం జ‌ర‌గాల్సిన‌ జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ చిత్రీకరణలను అక్టోబ‌ర్ 28కి పోస్ట్‌పోన్ చేసినట్లు  తెలుస్తోంది. ఒక‌వేళ ఆ స‌మ‌యానికి కూడా వీరు రికవర్ అవ్వకపోతే న‌వంబ‌ర్ మొద‌టి వారంలో షూటింగ్ చేస్తారని సమాచారం. సుధీర్, ర‌ష్మీ ద‌స‌రా పండుగ ప్ర‌త్యేక ఈవెంట్‌లో క‌లిసి డ్యాన్స్ చేశారు‌. ప్రస్తుతం ఆ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరలవుతున్నాయి.

Also Read :

“వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్

పిడుగులు పడి ఒకరి మృతి, 26 మందికి గాయాలు