మహారాష్ట్ర: పిడుగులు పడి ఒకరి మృతి, 26 మందికి గాయాలు

మహారాష్ట్రలోని ఠాణెలో పిడుగులు పడి ఒక వ్యక్తి చనిపోగా, మరో 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

  • Ram Naramaneni
  • Publish Date - 3:58 pm, Thu, 22 October 20

మహారాష్ట్రలోని ఠాణెలో పిడుగులు పడి ఒక వ్యక్తి చనిపోగా, మరో 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఠాణెలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటన జరిగిన ప్రాంతాలను సందర్శించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

మహారాష్ట్రలో భారీ వర్షపాతం కొనసాగుతుండగా..ఇప్పటివరకు అక్కడ 29 మంది ప్రాణాలు కోల్పోయాయి. బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఉస్మానాబాద్ జిల్లాలోని వర్షంతో బాధపడుతున్న కాటేగావో గ్రామాన్ని సందర్శించి పంటలకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత వారం నాలుగు రోజులుగా కురిసిన కుండపోత వర్షాలు, వరదల కారణంగా పంటలు నాశనమయ్యాయి.

Also Read :

“వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్

నెట్‌ఫ్లిక్స్‌ నయా ఆఫర్.. 48 గంటలు ఉచితం

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన మేఘనా రాజ్