“వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్

అనుకున్న సమయం రానే  వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ నుంచి తారక్ టీజర్  రిలీజయ్యింది. అభిమానులు అంచనాలు  మించిపోయేలా రాజమౌళి ఈ టీజర్‌ను రూపొందించారు.

  • Ram Naramaneni
  • Publish Date - 12:13 pm, Thu, 22 October 20

అనుకున్న సమయం రానే  వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ నుంచి తారక్ టీజర్  రిలీజయ్యింది. అభిమానులు అంచనాలు  మించిపోయేలా రాజమౌళి ఈ టీజర్‌ను రూపొందించారు. విజువల్ ఫీస్ట్ అనే  చెప్పాలి. కొమరం భీమ్ పాత్రలో తారక్ ఒదిగిపోయాడు. రగిలే నిప్పులా కనిపించాడు. బ్యాగ్రౌండ్‌లో చరణ్ వాయిస్ ఆ అగ్గికి మరింత ఫైర్ తీసుకొచ్చింది.

“వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్..‌
నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయ్‌..
వాడి పొగరు ఎగిరే జెండా..
వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ..
వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ..
నా తమ్ముడు గోండు బెబ్బులి..కొమురం భీం” అంటూ చరణ్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తోన్న తారక్ పాత్రను పరిచయం చేశాడు. 


రౌద్రం రణం రుథిరం పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి సౌత్ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మల్టిస్టారర్ రూపొందిస్తున్నారు.  ప్యాన్ ఇండియా మూవీగా ఈ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా, చరణ్‌లు అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ కనిపించనున్నాడు. రాజమౌళి బాహబలి సిరీస్ తర్వాత తెరకెక్కిస్తోన్న మూవీ కావడంతో..దీనిపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకున్నాయి. కాగా గతంలో చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తారక్  వాయిస్ ఓవర్‌లో సినిమాలోని చరణ్ పాత్రను పరిచయం చేసిన విషయం తెలిసిందే.

Also Read : నెట్‌ఫ్లిక్స్‌ నయా ఆఫర్.. 48 గంటలు ఉచితం