Akkada Ammayi Ikkada Abbayi: ట్రైలర్ అదిరిపోయినాదిగా.. ప్రదీప్ మాచిరాజు హీరోగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. నవ్వులే నవ్వులు..
బుల్లితెరపై ఇన్నాళ్లు తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఇక ఇప్పుడు కొన్నాళ్లుగా హీరోగా వెండితెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన ప్రదీప్.. ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో మరోసారి థియేటర్లలోకి రాబోతున్నాడు.

బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ఉన్న యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. తనదైన యాంకరింగ్.. కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఇక ఇప్పుడు కెరీర్ కు గ్యాప్ ఇచ్చి హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి హీరోగా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.
మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై జబర్ధస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న డైరెక్టర్స్ నితిన్, భరత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రదీప్ సరసన బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమె వెండితెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది. తాజాగా సోమవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ చదివిన ఓ కుర్రాడు తన స్నేహితుడితో కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం పల్లెటూరికి వెళ్తాడు. అ తాపీ పని వాళ్లతో, అలాగే గ్రామస్తులతో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు.. ? ఆ ఊర్లో ఉన్న ఒకే ఒక అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనే కథనంతో సినిమా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..