Bollywood: 51 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడిన హీరోయిన్.. మాజీ క్రికెటర్‌తో డేటింగ్.. ?
ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆమె సంచలనం. స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. 51 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు ధీటుగా అద్భుతమైన ఫిట్నెస్ లుక్‌తో ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ అమ్మడు సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఇప్పుడు మరోసారి ఆమె డేటింగ్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ పేరు తెగ మారుమోగుతుంది. 50 ఏళ్లు దాటిన చెక్కు చెదరని అందంతో కుర్ర హీరోయిన్లకు సైతం గుబులు పుట్టిస్తోంది. ఒకప్పుడు స్పెషల్ పాటలతో ఇండస్ట్రీని ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నిత్యం పర్సనల్ విషయాలతో వార్తలలో నిలుస్తుంది. పెళ్లి, విడాకులు.. ఆ తర్వాత తనకంటే చిన్నవాడితో లవ్, డేటింగ్ అంటూ ఎన్నోసార్లు ట్రోలింగ్ ఎదుర్కొంది. ఇక ఇప్పుడు 51 ఏళ్ల వయసులో మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. ఇటీవలే అర్జున్ కపూర్ తో బ్రేకప్ జరిగిందని ప్రచారం జరగ్గా.. ఇప్పుడు ఆమె పేరు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగక్కర్ తో వినిపిస్తుంది. ఇందుకు కారణం తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోస్.
అసలు విషయానికి వస్తే.. మార్చి 30న గౌహతి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. ముంబైలో జరిగే మ్యాచ్‌లకు బాలీవుడ్ ప్రముఖులు హాజరు కావడం సర్వసాధారణం. అయితే, మలైకా గౌహతికి ఎందుకు వచ్చిందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మలైకా, కుమార్ సంగక్కర్ ఇద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.
కుమార్ సంగక్కర్ రాజస్థాన్ రాయల్స్ మాజీ కోచ్. ఇప్పుడు అతను RR జట్టుకు మద్దతు ఇచ్చాడు. మలైకా కూడా రాజస్థాన్‌కు మద్దతు ఇచ్చింది. ఈ విషయంపై అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంగక్కర్ కీలక పాత్ర పోషించాడు. అతను చాలా సీజన్లలో కోచ్‌గా ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు RR కోచ్‌గా ఉండటం ప్రత్యేకం. చెన్నైపై రాజస్థాన్ విజయం మలైకా ఆనందాన్ని మరింత పెంచింది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి.
View this post on Instagram
Is Malaika Arora dating sangakaara ???#MalaikaArora #RRvsCSK #JoinIndianArmy #45TheMovie #EidMubarak #VikramotsavUjjainMP #WatchSikandarInTheatresNow pic.twitter.com/P1c66nsNjK
— Aditi (@glamourworld77) March 30, 2025
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..