Allu Arjun: అల్లు స్టూడియోస్ పెట్టడానికి అసలు కారణం ఏంటో చెప్పిన అల్లు అర్జున్..

తాజాగా ఈ స్టూడియో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Allu Arjun: అల్లు స్టూడియోస్ పెట్టడానికి అసలు కారణం ఏంటో చెప్పిన అల్లు అర్జున్..
Allu Arjun
Follow us

|

Updated on: Oct 02, 2022 | 10:58 AM

ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన తనయులు అల్లు అరవింద్ నేతృత్వంలో అల్లు స్టూడియో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ స్టూడియో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు అల్లు కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో కొత్త ఫిల్మ్ స్టూడియో – “అల్లు స్టూడియోస్‌” ను ప్రారంభించారు. ఈ శతజయంతి వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్,పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్,అల్లు శిరీష్ మరియు మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ..

ముందుగా మెగాస్టార్ చిరంజీవిగారికి తన తరుపున,అల్లు కుటుంబం తరుపున కృతజ్ఞతలు తెలిపారు బన్నీ. అందరూ అనుకోవచ్చు అల్లు అరవింద్ గారికి గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉంది, వాళ్లకి పెద్ద ల్యాండ్ ఉండి ఉంటుంది. వాళ్ళకి స్టూడియో పెట్టడం పెద్ద విశేషం కాకపోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ స్టూడియో పెట్టిన పర్పస్ మాకేదో కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని కాదు.. ఈ స్టూడియోస్ పెట్టడానికి కారణం ఇది మా తాతయ్య గారి కోరిక అన్నారు అల్లు అర్జున్. ఆయన జ్ఞాపకంగా ఇది నిర్మించాం. ఇక్కడ మంచి మంచి సినిమాలు షూటింగ్ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మాములుగా తండ్రి చనిపోతే కొన్నేళ్ళు పూజ చేస్తారు. రోజులు మారే కొద్దీ చనిపోయిన వాళ్ల మీద ప్రేమ ఉంటుంది. వాళ్ళు గుర్తుంటారు కానీ ముందుగా చేసినంత భారీస్థాయిలో మళ్ళీ మళ్ళీ ఫంక్షన్ లు చెయ్యరు. కానీ మా నాన్నగారు సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ ఇంకా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారిని ఇంతలా ప్రేమిస్తున్నారు అని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. వాళ్ళ నాన్నని అంతగా ఇష్టపడే మా నాన్నగారికి నా అభినందనలు. అలానే ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా మెగా అభిమానులకు. నన్ను ప్రేమించే నా ఆర్మీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.. అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి