The Ghost: అందుకే మా సినిమా ఘోస్ట్ అనే టైటిల్ పెట్టాం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రవీణ్ సత్తారు

ఇప్పుడు 'ది ఘోస్ట్' గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు.

The Ghost: అందుకే మా సినిమా ఘోస్ట్ అనే టైటిల్ పెట్టాం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రవీణ్ సత్తారు
Praveen Sattaru
Follow us

|

Updated on: Oct 02, 2022 | 10:41 AM

కింగ్ నాగార్జున వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సినిమా చేస్తూ రాణిస్తున్నారు ఇటీవలే బంగార్రాజు, బ్రహ్మాస్త్ర సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు నాగ్. ఇక ఇప్పుడు ‘ది ఘోస్ట్’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది.. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఘోస్ట్ అనేది ఊహాతీతమైన పదం. రా, ఇంటల్జెన్స్ ఫీల్డ్ లో ఈ పదానికి ఒక పవర్ వుంది. ఘోస్ట్ ప్రోటోకాల్ అని అంటారు. ఇందులో కథానాయకుడి కోడ్ ఘోస్ట్. అండర్ వరల్డ్ అతనికి పెట్టినపేరు ఘోస్ట్ అని అన్నారు ప్రవీణ్ సత్తారు . అలాగే నాగార్జున గారంటే నా మనసులో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వుంది. ఆ రకంగా చూపించాలని కథ రాయడం జరిగింది. నా కెరీర్ లో హీరోకి కథ రాయడం ఇదే తొలిసారి. ఆయన ఇంటన్సిటీ, స్టయిల్, గ్రేస్ ఉపయోగించుకొని , ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నానో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. తక్కువగా మాట్లాడి బలమైన యాక్షన్స్ తో ఇంపాక్ట్ చూపే విధంగా వుంటుంది. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్. ప్రతి యాక్షన్ సీన్ వెనుక బలమైన ఎమోషన్ వుంటుంది. నిజానికి హీరోకి కథ రాయడం ఈజీ. మనకి ఒక స్పష్టమైన క్లారిటీ, డైరెక్షన్ వచ్చేస్తుంది. మన బౌండరీలు మనకి తెలిసిపోయినప్పుడు ఆ పరిధిలోనే ఆలోచిస్తాం. నన్ను అడిగితే ముందు కథ రాసుకొని తర్వాత అందులో నటులని ఫిట్ చేయడమే కష్టం అన్నారు ప్రవీణ్.

క్రియేటివ్ గా ఆలోచిస్తే సొంత ప్రొడక్షన్ నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు. సొంత ప్రొడక్షన్ చేయడం వలన నిర్మాత కష్టాలు కూడా తెలుసు. ఎంతవరకూ రాజీపడాలో తెలుసు. అయితే సొంత ప్రొడక్షన్ లో రిలీజ్ సమయంలో సమస్య వస్తుంది. సినిమాని రిలీజ్ చేయడం అంత తేలిక కాదు. మంచి ప్రోడక్ట్ ని రెడీ చేసిన తర్వాత దాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది చాలా ముఖ్యం. నా ప్రొడక్షన్ లో వచ్చిన చిత్రాలకు రిలీజ్ దగ్గర ఇబ్బందిపడ్డా. అయితే వేరే నిర్మాణ సంస్థలో చేస్తున్నపుడు కూడా నిర్మాత సెట్ లో వుంటే బావుంటుంది. నావరకూ నిర్మాతని ప్రతి రోజు సెట్ కి రమ్మని చెబుతాను. నిర్మాత సెట్ లో వుంటే పనులు త్వరగా జరుగుతాయి. హై ఎమోషన్స్ హీరోయిజం వున్న చిత్రమిది. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి. విజల్ వేసే మూమెంట్స్ కూడా వుంటాయి. క్లాస్ గా తీసిన పక్కా మాస్ ఫిల్మ్ ఇది. థియేటర్లో ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అని చెప్పుకొచ్చారు ప్రవీణ్ సత్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?