AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: నేను కాకుండా ఆ పని చేసిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే.. సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇప్పటికే ఈ సినిమా ప భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చిరు డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ సిస్టర్ గా నటిస్తోంది.

Salman Khan: నేను కాకుండా ఆ పని చేసిన ఏకైక వ్యక్తి  మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే.. సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Salman Khan, Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Oct 02, 2022 | 10:41 AM

Share

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చిరు డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ సిస్టర్ గా నటిస్తోంది. అలాగే సత్య దేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించి అలరించనున్నాడు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌ లపై ఆర్‌ బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో గ్రాండ్ జరిగింది.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తోపాటు సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. సా సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సల్మాన్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. సినిమాల పట్ల చిరంజీవి గారికి, మాకున్న ప్రేమే దీనికి కారణం. చిరంజీవి గారితో నటించడం గొప్ప అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. మల్టీ స్టార్ చిత్రాలు చేయడం పరిశ్రమకు మంచింది.

అలాగే సినిమాలని నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తారు. నెంబర్స్ పెరుగుతాయి. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది” అన్నారు. అలాగే కాస్టింగ్ కౌచ్ లేదని చాలా మంది చెబుతున్నా.. కాస్టింగ్ కౌచ్ ఉంది. మేమిద్దరం కలిసి థాయ్ లాండ్ లో ఓ యాడ్ షూటింగ్ చేశాం. అక్కడి నుంచి తిరిగి ముంబైకి వచ్చేశాం. మరుసటి రోజు ఉదయం విమానంలో హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంది. దాంతో ఆయన నా ఇంట్లోనే ఉండిపోయారు. ఆ సమయంలో ఆయన నా షాఫాలో పడుకున్నారు. నేను కాకుండా నా సోఫాలో పడుకున్న ఏకైక వ్యక్తి చిరు గారు అంటూ సరదాగా చెప్పారు సల్మాన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Follow Us
ఇనుముతో తయారైన రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు..?
ఇనుముతో తయారైన రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు..?
ఏంటక్కా ఇలా తయారయ్యారు.. లవర్ కోసం ప్రియురాలు ఏం చేసిందంటే..
ఏంటక్కా ఇలా తయారయ్యారు.. లవర్ కోసం ప్రియురాలు ఏం చేసిందంటే..
సంజూ @ 26.. టీమిండియా విజయాన్ని అడ్డుకునే మొనగాడు ఉన్నాడా..?
సంజూ @ 26.. టీమిండియా విజయాన్ని అడ్డుకునే మొనగాడు ఉన్నాడా..?
ఆ చెత్త సినిమా ఎందుకు చేశారు సర్.! ఓపెన్‌గా అడిగేసిన బిచ్చగాడు..
ఆ చెత్త సినిమా ఎందుకు చేశారు సర్.! ఓపెన్‌గా అడిగేసిన బిచ్చగాడు..
ఆ రోజు పరిస్థితి దారుణం..షూటింగ్ టైంలో టీవీ పేలిపోయింది.
ఆ రోజు పరిస్థితి దారుణం..షూటింగ్ టైంలో టీవీ పేలిపోయింది.
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన పవర్ఫుల్ ఉమెన్స్..
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన పవర్ఫుల్ ఉమెన్స్..
సమ్మర్‌లో అదిరే బిజినెస్.. కేవలం 3 నెలలు కష్టపడితే రూ.3 లక్షల..
సమ్మర్‌లో అదిరే బిజినెస్.. కేవలం 3 నెలలు కష్టపడితే రూ.3 లక్షల..
IND vs NZ: ఒకే దెబ్బకు 3 భారీ ప్రపంచకప్ రికార్డులు.. అవేంటంటే?
IND vs NZ: ఒకే దెబ్బకు 3 భారీ ప్రపంచకప్ రికార్డులు.. అవేంటంటే?
నిమిషాల్లోనే మెదడు గడ్డలకు చికిత్స..దక్షిణ భారతంలోనే హైదరాబాద్‌లో
నిమిషాల్లోనే మెదడు గడ్డలకు చికిత్స..దక్షిణ భారతంలోనే హైదరాబాద్‌లో
బెడ్‌రూమ్‌ ఏసీ నుంచి అదే పనిగా శబ్ధాలు.. దగ్గరకు వెళ్లగా.. వామ్మో
బెడ్‌రూమ్‌ ఏసీ నుంచి అదే పనిగా శబ్ధాలు.. దగ్గరకు వెళ్లగా.. వామ్మో