AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Meena: ఆమెను చూస్తే అసూయ కలుగుతోంది.. సీనియర్ నటి మీనా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

తాజాగా సీనియర్‌ నటీమణి మీనా ఐశ్వర్యరాయ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోషల్‌ మీడియా వేదికగా పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాపై స్పందించిన ఆమె ఐశ్వర్యను చూస్తుంటే జీవితంలో మొదటిసారి అసూయ కలుగుతోందంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేసింది.

Actress Meena: ఆమెను చూస్తే అసూయ కలుగుతోంది.. సీనియర్ నటి మీనా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Meena
Basha Shek
|

Updated on: Oct 02, 2022 | 9:37 AM

Share

పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాతో నాలుగేళ్ల తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై దర్శనమిచ్చింది ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌. ఏకంగా రెండు పవర్‌ ఫుల్‌ పాత్రలతో ఫ్యాన్స్‌కు డబుల్ కిక్‌ ఇచ్చింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కెంచిన ఈ సినిమాలో చియాన్‌ విక్రమ్‌, జయం రవి, కార్తీ, త్రిష, ప్రకాశ్‌రాజ్‌, ఐశ్వర్యా లక్ష్మి.. ఇలా ఎంతోమంది తారలు నటించారు. అయినా ఐశ్వర్యనే సినిమాకు సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ అయ్యింది. అందుకు తగ్గట్లే సినిమా విడుదలయ్యాక నాలుగు పదులు ఐశ్వర్య అందం, అంతకుమించిన అభినయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా సీనియర్‌ నటీమణి మీనా ఐశ్వర్యరాయ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోషల్‌ మీడియా వేదికగా పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాపై స్పందించిన ఆమె ఐశ్వర్యను చూస్తుంటే జీవితంలో మొదటిసారి అసూయ కలుగుతోందంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేసింది.

జీవితంలో మొదటిసారిగా.. ‘ తన డ్రీమ్‌ క్యారెక్టర్‌ నందిని(పొన్నియన్‌ సెల్వల్‌లో ఐశ్యర్య చేసిన క్యారెక్టర్‌) కొట్టేసిన ఐశ్వర్యారాయ్‌ని చూసి అసూయ కలిగింది. నా జీవితంలో ఒకరిని చూసి అసూయ పడడం ఇదే మొదటిసారి. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించిన నటీనటులందరికీ నా అభినందనలు అని’ పీఎస్‌-1లో ఐశ్వర్య స్టిల్స్‌ను షేర్‌ చేసింది మీనా. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీనా చెప్పింది నిజమేనంటూ ఐష్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. కాగా సెప్టెంబర్‌ 30 న విడుదలైన పొన్నియన్‌ సెల్వన్‌ మొదటి రోజే దాదాపు రూ. 39 కోట్లు రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ. 23.50 కోట్లు వసూలు చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్లు.. కర్ణాటకలో రూ. 4 కోట్లు.. కేరళలో రూ. 3.25 కోట్లు.. నార్త్ ఇండియాలో కేవలం రూ. 2.75 కోట్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం రూ. 39 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌నిపుణులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

ఇక మీనా విషయానికొస్తే.. ఇటీవలే ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషాదం నుంచి కోలుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందీ అందాల తార. బ్రోడాడీ (మలయాళం), సన్నాఫ్‌ ఇండియా సినిమాల్లో చివరిసారిగా కనిపించిన ఆమె ప్రస్తుతం రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఓ సినిమాలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..