AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: చలాకి చంటికి ఊహించని షాక్ ఇచ్చిన హౌస్ మేట్స్.. ఈ సీజన్ మొత్తం ఇక అంతే

బిగ్ బాస్ లో వారాంతం వచ్చిందంటే చాలా హంగామా డబుల్ అవుతోంది. శని, ఆదివారాల్లో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తారు. హౌస్ మేట్స్ కు కావాల్సినంత గడ్డి పెట్టి ఆతర్వాత ఆటలాడిస్తుంటారు.

Bigg Boss 6 Telugu: చలాకి చంటికి ఊహించని షాక్ ఇచ్చిన హౌస్ మేట్స్.. ఈ సీజన్ మొత్తం ఇక అంతే
Chalaki Chanti
Rajeev Rayala
|

Updated on: Oct 02, 2022 | 8:38 AM

Share

బిగ్ బాస్ లో వారాంతం వచ్చిందంటే చాలా హంగామా డబుల్ అవుతోంది. శని, ఆదివారాల్లో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తారు. హౌస్ మేట్స్ కు కావాల్సినంత గడ్డి పెట్టి ఆతర్వాత ఆటలాడిస్తుంటారు. ఇక బిగ్ బాస్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నారు. ఎప్పటిలానే హౌస్ మేట్స్ గొడవలు, గోలలు, ఏడుపులు, అలకలతో సాగుతూ ఉంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకున్నారు. అంతే కాదు చలాకీ చంటి కి మాత్రం ఊహించని షాక్ ఇచ్చారు నాగార్జున. ఈ సీజన్ 6 మొత్తంలో చంటి కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు నాగ్. హౌస్‌లో ఒకే తప్పు నలుగురు చేసినప్పటికీ.. హౌస్‌మేట్స్ ఓట్ల ప్రకారం శిక్ష చంటికే పడింది. దాంతో కెప్టెన్సీ రేసు నుంచి చంటి తప్పుకోవాల్సి వచ్చింది.

హౌస్ లో ఇచ్చిన టాస్క్ లో భాగంగా అందరికి 5 వేలరూపాయల చొప్పున డబ్బులు ఇచ్చారు. చివరిగా ఎవరిదగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు విజేత అని ప్రకటించాడు. అయితే నలుగురి దగ్గర మాత్రం సున్నా డబ్బులు మిగిలాయి. వారిలో ఆదిరెడ్డి, బాలాదిత్య, చంటి, ఇనయ ఉన్నారు. వీరిలో ఒకరికి ఈ సీజన్ లో కెప్టెన్సీ రేస్ లో ఉండే అవకాశం ఉండదు అని చెప్పాడు నాగ్. హౌస్ లో ఉన్నవారు ఈ నలుగురికి ఓట్లు వేయాలని చెప్పాడు. ముందుగా బాలాదిత్య కు ఎంతమంది ఓట్లు వేస్తారు అని అడగ్గా.. ఒక్కరు కూడా చేయి ఎత్తలేదు. దీంతో ఆయన సేఫ్ అయ్యాడు.

ఆ తర్వాత ఆదిరెడ్డికి.. ఒక్క రేవంత్ మాత్రమే చేయెత్తాడు. ఆతర్వాత ఇనయా, చంటికి చేరి మూడు ఓట్లు పడ్డాయి. అయితే కెప్టెన్ కీర్తి ఓటు చంటికి వేసింది.  దాంతో ఎక్కువ ఓట్లు చంటికి రావడంతో అతడు కెప్టెన్సీ రేస్ ను అర్హుడు కాలేకపోయాడు. దాంతో ఇప్పుడు నీ విశ్వరూపం చూపించే సమయం వచ్చిందంటూ చంటికి చెప్పాడు నాగార్జున. నువ్వేంటే చూపించు.. నీ ఆటేంటో చూపించు అని చెప్పగానే .. కచ్చితంగా చూపిస్తానంటూ చంటి అన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..
అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..