Allu Arjun: క్రేజీ కాంబో.. అల్లు అర్జున్‏తో ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ను, సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ సందీప్.. దర్శకుడిగా మొదటి సినిమాతోనే తనదైన ముద్రను వేసి భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. ఇక ఇప్పుడు మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

Allu Arjun: క్రేజీ కాంబో.. అల్లు అర్జున్‏తో 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 03, 2023 | 9:32 AM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరుకి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. పుష్ప ముందు వరకు తెలుగు ప్రేక్షకులలో వీపరీతమైన క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించాడు. తనదైన శైలితో పుష్ప రాజ్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపాడు. బాక్సాఫిస్ వద్ద కలక్షన్స్ సునామి సృష్టించాడు బన్నీ. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ను, సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ సందీప్.. దర్శకుడిగా మొదటి సినిమాతోనే తనదైన ముద్రను వేసి భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. ఇక ఇప్పుడు మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాను చేయనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను టీ సిరీస్ ప్రొడక్షన్స్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించనున్నారు. గతంలో అర్జున్ రెడ్డి సినిమా అల్లు అర్జున్ చేసుంటే ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది అని దర్శకుడు సందీప్ పలుసార్లు చెప్పుకొచ్చాడు. ఈసారి అల్లు అర్జున్ తో సినిమా చేయనున్న సందీప్ ఐకాన్ స్టార్ ను ఏ రేంజ్ లో చూపించనున్నాడో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. అలాగే సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!