AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: స్నేహతో లవ్.. పెళ్లి విషయం ఎత్తగానే అల్లు అర్జున్ తల్లి మొదట ఏమన్నారో తెలుసా?

పుష్ఫ 2 ప్రమోషన్లలో భాగంగా అన్ స్టాపబుల్ సీజన్ 4 నాలుగో ఎపిసోడ్ కు అతిథిగా వచ్చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ టాక్ షోలో బన్నీ ఓపెన్ అయిపోయాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Allu Arjun: స్నేహతో లవ్.. పెళ్లి విషయం ఎత్తగానే అల్లు అర్జున్ తల్లి మొదట ఏమన్నారో తెలుసా?
Allu Arjun Family
Basha Shek
|

Updated on: Nov 15, 2024 | 6:09 PM

Share

బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో లో మరోసారి సందడి చేశాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే గతంలో ఈ షోకు వచ్చిన బన్నీ మళ్లీ ఇప్పుడు సీజన్ లో అతిథిగా విచ్చేశాడు. అల్లు అర్జున్ తో పాటు అతని తల్లి నిర్మలమ్మ కూడా అన్ స్టాపబుల్ లో సందడి చేయడం విశేషం. ఈ సందర్భంగా తల్లీ కొడుకులిద్దరూ బాలయ్యతో బాగా ముచ్చట్లు పెట్టారు. ఎవరికీ తెలియని చాలా విషయాలను పంచుకున్నారు. ఇక బాలయ్య కూడా రకరకాల ప్రశ్నలతో అల్లు అర్జున్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్పి షోను రక్తి కట్టించాడు బన్నీ. ఇక ఇదే షోకు మరో గెస్టుగా వచ్చిన నిర్మల అల్లు అర్జున్ చిన్నప్పటి విషయాలు పంచుకున్నారు. అలాగే అల్లు అరవింద్ గురించి, అల్లు రామలింగయ్య గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు బాలయ్య. స్నేహతో ప్రేమ, పెళ్లి గురించి అల్లు అర్జున్ మొదట మీకు చెప్పాడా? చెప్తే మీరు ఏమన్నారు అని నిర్మలమ్మను అడిగాడు బాలయ్య.

దీనికి నిర్మలమ్మ ‘ ఒక రోజు నా దగ్గరకు వచ్చి అమ్మ నేనొకటి చెప్పాలి. నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను’ అని చెప్పాడు. అప్పటికే బన్నీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నీకు నిజంగా 100 శాతం ఆ అమ్మాయి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో అన్నాను’ అని చెప్పుకొచ్చారు నిర్మలమ్మ. కాగా అల్లు అర్జున్.. స్నేహ రెడ్డి కొన్నాళ్ళు ప్రేమించి పెద్దలను ఒప్పించి 2011 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇప్పుడు అయాన్, ఆద్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

అన్ స్టాపబుల్ షోలో బాలయ్యతో బన్నీ..

కాగా ఇదే అన్ స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ పిల్లలు కూడా సందడి చేశాడు. అయితే వీరిద్దరి ముచ్చట్లు మరో ఎపిసోడ్ లో ఉండనుంది.

ఆహాలో ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చేయండి.

ఈ అక్కా చెల్లెళ్లను గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో బాగా ఫేమస్
ఈ అక్కా చెల్లెళ్లను గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో బాగా ఫేమస్
గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?
గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?
ఎమ్మెల్యే కారును ఆపిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఎమ్మెల్యే కారును ఆపిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
పుట్టిన వెంటనే శిశువు ఏడవడానికి అసలు కారణం ఇదే..
పుట్టిన వెంటనే శిశువు ఏడవడానికి అసలు కారణం ఇదే..
అటు బుమ్రా, ఇటు అర్షదీప్.. కెరీర్‌లోనే తొలిసారి చెత్త రికార్డ్
అటు బుమ్రా, ఇటు అర్షదీప్.. కెరీర్‌లోనే తొలిసారి చెత్త రికార్డ్
ట్రంప్ తీరుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహం..!
ట్రంప్ తీరుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహం..!
వీసా, రూపే, మాస్టర్.. ఏది తీసుకుంటే మంచిదో తెలుసా..?
వీసా, రూపే, మాస్టర్.. ఏది తీసుకుంటే మంచిదో తెలుసా..?
IND vs PAK: పాక్ ఆటగాళ్లతో చేయి కలపనున్న వైభవ్ సూర్యవంశీ..
IND vs PAK: పాక్ ఆటగాళ్లతో చేయి కలపనున్న వైభవ్ సూర్యవంశీ..
గ్లోబల్ సమ్మిట్, పంచాయతీ ఎన్నికలు.. తెలంగాణ పోలీసులకు మరో ఛాలెంజ్
గ్లోబల్ సమ్మిట్, పంచాయతీ ఎన్నికలు.. తెలంగాణ పోలీసులకు మరో ఛాలెంజ్
చీరకట్టుతో పవర్ లిఫ్టింగ్..ప్రగతిపై నాగబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్
చీరకట్టుతో పవర్ లిఫ్టింగ్..ప్రగతిపై నాగబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్