Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. కుర్రాళ్లకు ఇష్టమైన ఆ సూపర్ హిట్ రీరిలీజ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. ఇటీవలే పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ దాదాపు 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కోలీవుడ్ సెన్సేషన్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు.

Allu Arjun: ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. కుర్రాళ్లకు ఇష్టమైన ఆ సూపర్ హిట్ రీరిలీజ్..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 30, 2025 | 7:41 PM

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌.. ఇదొక సన్సేషనల్‌ కాంబో.. పుష్ప, పుష్ప-2 చిత్రాల తరువాత ఈ కాంబినేషన్‌ పవర్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. పుష్ప-2 చిత్రంతో వసూళ్లలో సరికొత్త రికార్డులు నెలకొల్పిన ఈ క్రేజీ కాంబో.. తొలి సినిమా ఆర్య’ వంటి విభిన్న ప్రేమకథా చిత్రం తరువాత రూపొందిన రెండో చిత్రం ‘ఆర్య-2’. ఆర్యకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సన్సేషనల్‌గా నిలిచింది. 2009లో విడుదలైన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్‌ పర్‌ఫార్మెన్స్‌, దేవి శ్రీప్రసాద్‌ సన్సేషనల్‌ మ్యూజిక్‌, సుకుమార్‌ బ్రిలియంట్‌ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌కు, ఐకాన్‌ స్టార్‌ అభిమానులకు వన్‌ఆఫ్‌ దఫేవరేట్‌ చిత్రంగా నిలిచింది.

అయితే గత కొంతకాలంగా రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో ఆర్య-2 చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ఆర్య-2 రిరీలీజ్‌ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఎంతో కిక్‌ ఇచ్చే వార్త. సో.. ఏప్రిల్‌ 5న ఆర్య-2 రిరీలీజ్‌ కోసం అందరూ సిద్దమవుతున్నారు. ఆదిత్య ఆర్ట్స్‌ పతాకంపై బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో ఆదిత్యబాబు నిర్మించిన ఈ చిత్రంలో నవదీప్‌, కాజల్‌ అగర్వాల్‌ ఇతర ముఖ్య తారాగణంగా నటించారు. 2009లో విడుదలైన ఆర్య-2 అంటే దాదాపు 15 సంవత్సరాలు తరువాత మళ్లీ వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప 2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ.. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..