Tollywood: అందరికీ తెలిసిన వార్తే.. కానీ, టబు పెళ్లి చెడిపోయింది తనవల్ల కాదట.. ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో
సినీ పరిశ్రమలో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. కానీ, టబు అభిమానులను మాత్రం ఆమె సింగిల్ గా ఉండిపోవడం ఎంతో కలచివేసింది. అందుకు కారణం ఓ స్టార్ హీరోనే అని అప్పట్లో పెద్ద ఎత్తున గాసిప్స్ వినిపించాయి. కానీ పాతికేళ్లు ఆ హీరో అసలు విషయం బయటపెట్టి షాకిచ్చాడు. టబు పెళ్లి చెడిపోవడానికి తాను కారణం కాదని ఇండైరెక్ట్ గా తెలిపాడు.

సౌత్ లో ప్రేమ దేశం సినిమాతో టబు రేపిన ప్రేమ తుఫాను అప్పటి కుర్రకారు ఇంకా మర్చిపోలేరేమో.. దాని నుంచి తేరుకునేలోపే నిన్నే పెళ్లాడతా అంటూ తెలుగు ఆడియెన్స్ మనసుల్ని కొల్లగొట్టేసింది. ఇక తమళ్, హిందీ భాషల్లోనూ వరుస హిట్లతో ఈ పొడుగు కాళ్ల సుందరి తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఆమె సినిమాల సంగతి అటుంచితే.. ఇప్పుడీ బ్యూటీ 50 ఏళ్లు దాటేసింది. కానీ, ఇంకా బ్యాచిలర్ గానే కొనసాగుతోంది. అందుకు ఎన్నో కారణాలు అప్పట్లో మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఇప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఇది అని ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఈ క్రమంలో టబుకు కొందరు హీరోలు, నిర్మాతలకు ముడిపెడుతూ ఎన్నో రూమర్లు కూడా పుట్టుకొచ్చాయి. అప్పట్లో హిందీ హీరో అజయ్ దేవగణ్ తో టబు క్లోజ్ గా ఉందనే టాక్ నడిచింది. ఇక ఆ తర్వాత అన్నింటికన్నా పెద్ద రూమర్ తెలుగు స్టార్ నాగార్జునతో ఈ ముద్దుగుమ్మ రిలేషన్ షిప్ అంటూ వార్తలొచ్చాయి.
ఎట్టకేలకు వీటికి చెక్ పెడుతూ.. ఇక ఓ ఇంటర్వ్యూలో నాగార్జున టబుతో రిలేషన్ పై నోరు విప్పాడు. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. టబుకు ఏదైనా కష్టమొస్తే ఇప్పటికీ తనతో రాత్రి 2 గంటలకైనా ఫోన్ చేసి మాట్లాడుతుందన్నాడు. అయితే, అతిగా ఎమోషనల్ గా, సెన్సిటివ్ గా ఉండటం ఆమె బలహీనత అని.. చిన్న విషయాలకు కూడా కంటతడి పెట్టుకునే టైప్ అని చెప్పాడు. అందుకే ఆమె తనను అర్థం చేసుకోగల వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టు వెల్లడించాడు.
ఓ శుభ సందర్భంలో తన ఎంగేజ్మెంట్ అంటూ షాకిచ్చింది బ్యూటీ. బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియావాలాతో పీకల్లోతు ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని వార్తలొచ్చాయి. అయితే పెళ్లికి ముందు చివరి నిమిషంలో వారి ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయింది. అప్పటి నుంచి పెళ్లివైపు తిరిగి చూడలేదు. ఒంటరిగానే ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నది. తాను పెళ్లి చేసుకోకపోవడంపై టబు స్పందిస్తూ.. జీవితంలో సంతోషానికి చాలా మార్గాలు ఉన్నాయి. రిలేషన్‌షిప్ ఒక్కటే మార్గం కాదు. ఒంటరితనాన్ని కొనసాగించడం కష్టమేమీ కాదు. మన జీవితంలోకి భాగస్వామి పేరుతో తప్పుడు వ్యక్తి వస్తే అతకంటే నరకం మరోటి ఉండదు. దానికంటే ఒంటరితనమే చాలా బెటర్ అని టబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.