Mahesh Babu: మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఆమె భర్త తెలుగు స్టార్ హీరో..
సోషల్ మీడియాలో సినీతారల పర్సనల్ విషయాలు ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. ఇక సెలబ్రెటీస్ చైల్డ్ హుడ్ ఫోటోస్ గురించి చెప్పక్కర్లోదు. కొన్నాళ్లుగా స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి పిక్స్ ఎక్కువగా వైరలవుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు త్రోబ్యాక్ పిక్ అందరి దృష్టిని పోషిస్తుంది.

సోషల్ మీడియాలో సినీతారల పర్సనల్ విషయాలు ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. ఇక సెలబ్రెటీస్ చైల్డ్ హుడ్ ఫోటోస్ గురించి చెప్పక్కర్లోదు. కొన్నాళ్లుగా స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి పిక్స్ ఎక్కువగా వైరలవుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు త్రోబ్యాక్ పిక్ అందరి దృష్టిని పోషిస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో మహేష్ బాబు పక్కన నిలబడి ఎంతో అమాయకంగా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా.. ? ఆ అమ్మాయి హీరోయిన్ అనుకుంటే పొరపాటు పడినట్లే. ఆమె ఓ స్టార్ హీరో కూతురు.. అంతేకాదు.. ఆమె భర్త ఇప్పుడు తెలుగులో టాప్ హీరో. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదండి.. దివంగత స్టార్ కృష్ణ చిన్న కూతురు.. సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని ఘట్టమనేని. టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సుధీర్ బాబు సతీమణి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రియదర్శిని ఘట్టమనేని.. కృష్ణ, ఇందిరా దేవి దంపతుల చిన్న కుమార్తె. సినిమాలకు దూరంగా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు నలుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల, ప్రియదర్శిని. పెద్దబ్బాయి రమేష్ బాబు హీరోగా, నటుడిగా ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత నిర్మాతగానూ రాణించారు. ఇక చిన్నబ్బాయి మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. కృష్ణ నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక మంజుల ఘట్టమనేని సైతం ఇండస్ట్రీలో నటిగా పేరు సంపాదించుకుంది. ఎన్నో సినిమాల్లో కీలకపాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
కానీ ప్రియదర్శిని మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2006లో హీరో సుధీర్ బాబు, ప్రియదర్శినీల వివాహం జరిగింది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వీరికి ఇద్దరు అబ్బాయిలు. పెద్దబాయి చరిత్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు 2012లో శివ మనసులో శ్రుతి సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు.