Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna- KCR: కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. ఆస్పత్రిలో బీఆర్‌ఎస్‌ అధినేతను పరామర్శించిన హీరో నాగార్జున

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్‌ చిరంజీవి, తెలంగాణ బీఎస్పీ చీఫ్‌ ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు కేసీఆర్‌ను స్వయంగా కలిసి పరామర్శించారు. తాజాగా టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున బీఆర్ఎస్‌ అధినేతను కలిశారు.

Nagarjuna- KCR: కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. ఆస్పత్రిలో బీఆర్‌ఎస్‌ అధినేతను పరామర్శించిన హీరో నాగార్జున
Nagarjuna, KCR, KTR, KCR
Follow us
Basha Shek

|

Updated on: Dec 14, 2023 | 4:38 PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్ర శేఖర రావు క్రమంగా కోలుకుంటున్నారు. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో హిప్‌ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరగవుతోంది. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని మళ్లీ ఆయనను ప్రజాక్షేత్రంలో చూడాలని అందరూ కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్‌ చిరంజీవి, తెలంగాణ బీఎస్పీ చీఫ్‌ ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు కేసీఆర్‌ను స్వయంగా కలిసి పరామర్శించారు. తాజాగా టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున బీఆర్ఎస్‌ అధినేతను కలిశారు. తన సోదరుడు నిర్మాత అక్కినేని వెంకట్‌తో కలిసి యశోధా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. కేసీఆర్ గారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే మాజీ మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌లతో కాసేపు ముచ్చటించారు. అంతకు ముందు వ్యవసాయ శాఖ, సహకార శాఖా మత్రి తుమ్మల నాగేశ్వర రావు కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయనను పలకరించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

ఇదిలా ఉంటే తన కోసం ఆస్పత్రికి రావొద్దని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు కేసీఆర్‌. దీని వల్ల ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. త్వరలోనే తాను కోలుకుని అందరి మధ్యకు వస్తానని, కలుస్తానని ఒక వీడియోను రిలీజ్‌ చేశారు బీఆర్ఎస్‌ చీఫ్‌. ‘దయచేసి సహకరించండి. నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు. కోలుకుని త్వరలోనే మీ నడుమకు వస్తా. ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపడం లేదు. ఎవరూ యశోద ఆస్పత్రికి రాకండి. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తాను. అప్పడిదాకా సంయమనం పాటించండి. వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నాను. పార్టీ శ్రేణులు, అభిమానులు సహకరించాలి’ అని గద్గద స్వరంతో చెప్పకొచ్చారు కేసీఆర్‌.

ఇవి కూడా చదవండి

కేసీఆర్ తో మాట్లాడుతున్న నాగార్జున..

కేసీఆర్ తో మంత్రి తుమ్మల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..