Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలకృష్ణ వ్యాఖ్యలపై భగ్గుమంటోన్న అక్కినేని ఫ్యాన్స్‌.. మా అసోసియేషన్‌ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల అక్కినేని అభిమానులు నిరసన చేపట్టారు. అనంతపురం ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అక్కినేని ఫ్యాన్స్.. బాలయ్య వ్యాఖ్యల విషయంలో మా అసోసియేషన్‌ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Balakrishna: బాలకృష్ణ వ్యాఖ్యలపై భగ్గుమంటోన్న అక్కినేని ఫ్యాన్స్‌.. మా అసోసియేషన్‌ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌
Balakrishna, Akkineni
Follow us
Basha Shek

|

Updated on: Jan 25, 2023 | 1:00 PM

వీరసింహారెడ్డి సక్సెస్‌ మీట్‌లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈమేరకు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల అక్కినేని అభిమానులు నిరసన చేపట్టారు. అనంతపురం ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అక్కినేని ఫ్యాన్స్.. ఈ విషయంలో మా అసోసియేషన్‌ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు..  ‘ఒక లెజెండరీ యాక్టర్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. గతంలో కూడా బాలకృష్ణ చాలామంది మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు దీనిపై మా అసోసియేషన్ ఎందుకు స్పందించలేదు. టికెట్లు రేట్లు పెంచేందుకు సమావేశాలు అవుతారు కానీ.. దీనిపై మాట్లాడరా? వెంటనే మా అసోసియేషన్ బాలకృష్ణ వ్యాఖ్యల మీద స్పందించాలి. బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోతే అక్కినేని ఫ్యాన్స్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తాం’ అని ఫ్యాన్స్ హెచ్చరించారు. మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ నిరసనకు దిగారు అక్కినేని ఫ్యాన్స్‌. బాలకృష్ణ అనుచిత వాఖ్యలను నిరసిస్తూ నర్తకి సెంటర్ లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఫ్లెక్సీ దగ్ధం చేసిన అక్కినేని ఫ్యాన్స్ వెంటనే తన వ్యాఖ్యలను డిమాండ్‌ చేశారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు.

ఇక బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటున్నాయి. అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలకు ఆయన వారసులు, అభిమానులు సీరియస్‌గా రియాక్ట్ అవ్వగా.. ఎస్వీ రంగారావుపై చేసిన కామెంట్స్‌పై కాపు నేతలు తీవ్రంగా స్పందించారు. బాలకృష్ణకు, టీడీపీకి కాపునాడు అల్టీమేటం ఇచ్చింది. ఈ నెల 25వ తేదీ లోపు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. తాజాగా మంత్రి రోజా కూడా బాలయ్య వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ అక్కినేనిని అవమానించడం తప్పన్నారు. ఎన్టీఆర్‌ని అవమానిస్తే వీళ్లు ఎంత బాధ పడతారో, అదే విధంగా అక్కినేని అభిమానులు కూడా బాధపడతారన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..