Akkineni Akhil: అన్నయ్య సైలెంట్ కిల్లర్.. నాగ చైతన్యపై అక్కినేని అఖిల్ ఫన్నీ కామెంట్స్..
కొంతకాలంగా శరవేగంగా షుటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ. అఖిల్ నుంచి రాబోతున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రచారం విషయంలో కాస్త ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు.
అక్కినేని నాగార్జున నటవారసుడిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అఖిల్. మొదటి సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ఏజెంట్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వార్ కు రెడీ అవుతుంది. కొంతకాలంగా శరవేగంగా షుటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ. అఖిల్ నుంచి రాబోతున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రచారం విషయంలో కాస్త ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా అఖిల్ యాంకర్ సుమతో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో తన వ్యక్తిగత జీవితం.. ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆరు గంటల తర్వాత షూటింగ్ పూర్తిచేసుకుని నాన్న ఇంటికి వస్తే పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తారని అన్నారు. ఇంట్లో సినిమా విషయాలు పెద్దగా చర్చకు రావని.. తన సినిమాల గురించి ఇంట్లో అస్సలు అడగరని అన్నారు. డెస్టినేషన్స్ వంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడతారని అన్నారు. ఇక నాగార్జున లాగే.. అన్నయ్య చైతన్య కూడా చాలా కూల్ అని.. ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారని తెలిపారు.
అన్ని విషయాల్లో కూల్ గా ఎలా ఉండాలనేది నాన్న నుంచి తీసుకోవడానికి ఇష్టపడతానని.. అలాగే ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలనేది అమ్మ నుంచి తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇక అన్నయ్య చైతన్య గురించి అడగ్గా.. తాను సైలెంట్ క్లిలర్ అని.. అన్నీ సైలెంట్ గా చేసేస్తాడని.. ఏది ఎక్కడ వదలాలో అక్కడ సరిగ్గా వదులుతాడని.. నాకవన్నీ తెలియవని చెప్పారు.