AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో గుడ్ న్యూస్ చెప్పనున్న అక్కినేని ఫ్యామిలీ.. ఆనందంలో అభిమానులు

అక్కినేని వారి ఇంట వరుసగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. గత ఏడాది డిసెంబర్ 04న అక్కినేని నాగ చైతన్య, శోభితల వివాహం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ పెళ్లి పనుల్లో ఉండగానే అక్కినేని అఖిల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు.

మరో గుడ్ న్యూస్ చెప్పనున్న అక్కినేని ఫ్యామిలీ.. ఆనందంలో అభిమానులు
Akkineni Family
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2025 | 8:43 AM

Share

అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం ఆనందంలో తేలిపోతుంది. ఇటీవలే నాగ చైతన్య వివాహం జరగడంతో అక్కినేని ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. నాగ చైతన్య , నటి శోభితను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. అలాగే పెళ్లి తర్వాత నాగచైతన్య తండేల్ సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన్న తండేల్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగ చైతన్య అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ మరో గుడ్ న్యూస్ పంచుకుందని సోషల్ మీడియాలో , ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. మరోసారి అక్కినేని ఇంట పెళ్ళిసందడి మొదలవ్వనుంది. నాగచైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ కూడా తన ప్రేయసితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఇన్ని రోజులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది.

ఇది కూడా చదవండి : ఇదేందయ్యా ఇది..! ఎలా ఉన్న హీరోయిన్ ఎలా మారిపోయింది..!! అస్సలు గుర్తుపట్టలేదు గురూ..!

హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అక్కినేని అఖిల్ నిశ్చితార్థం విషయాన్నినాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అఖిల్ , జైనాబ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి నాగార్జున అభిమానులకు ఈ హ్యాపీ న్యూస్ చెప్పారు. కాగా ఇప్పుడు అఖిల్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. మార్చి24న అఖిల్ వివాహం జరగబోతుందని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయింది.. ప్లాట్ ఫామ్ మీద నిద్రపోయింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్

ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలకు కూడా జరుపుకొని తేదీని ఫిక్స్ చేశారని టాక్. అఖిల్-జైనల్‌ల వివాహం ఘనంగా చేసేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వివాహ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు రానున్నారని అంటున్నారు. సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్స్ ను కూడా వీరి వివాహానికి ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ప్రస్తుతం అఖిల్ సీసీఏల్ లో బిజీగా ఉన్నాడు. అలాగే త్వరలోనే కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేయనున్నాడు.

ఇది కూడా చదవండి :25 సినిమాలు చేస్తే అందులో 5 హిట్లు.. కట్ చేస్తే నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.