Akhil Akkineni : తిరిగి పట్టాలెక్కనున్న అఖిల్ మూవీ.. ‘ఏజెంట్’ షూటింగ్ రీస్టార్ట్ అయ్యేది అప్పుడే..

అక్కినేని కుర్ర హీరో అఖిల్ చాలా కాలం తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. అఖిల్ హీరోగా యాక్షన్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వంలో పరిచయమైన విషయం తెలిసిందే.

Akhil Akkineni : తిరిగి పట్టాలెక్కనున్న అఖిల్ మూవీ.. 'ఏజెంట్' షూటింగ్ రీస్టార్ట్ అయ్యేది అప్పుడే..
Akhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 11, 2022 | 9:42 AM

Akhil Akkineni : అక్కినేని కుర్ర హీరో అఖిల్ చాలా కాలం తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్(Most Eligible Bachelor) సినిమాతో హిట్ అందుకున్నాడు. అఖిల్ హీరోగా యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్(V. V. Vinayak) దర్శకత్వంలో పరిచయమైన విషయం తెలిసిందే. అఖిల్(Akhil) అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్కినేని అభిమానులను నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో సినిమా చేశాడు అఖిల్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఈ యంగ్ హీరోకి హిట్ అందించలేక పోయింది. ఇక వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మిస్టర్ మజ్ను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేశాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ నెల 15వ తేదీ తరువాత నుంచి తదుపరి షెడ్యూల్ మొదలవుతున్నట్టుగా తెలుస్తోంది.  ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకోనున్నాడు అఖిల్. ఈ సినిమాలో కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఏజెంట్ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Avika Gor: చీరకట్టులో సోయగాలు వలక పోస్తున్న చిన్నారి పెళ్లి కూతురు లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Bhanu Shree: లంగా ఓణీలో తన అందాలు చూపిస్తూ ఫాన్స్‌ను మైమరిపిస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఇమేజెస్

Unstoppable NBK: బాలయ్య తనపై వచ్చే మీమ్స్‌ చూసి ఏమనుకుంటారు.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ‘ఆహా’ వీడియో..