AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: ‘మెగా బెగ్గింగ్ చూసి హర్ట్ అయ్యా’.. అర్థరాత్రి చిరుపై ఆర్జీవీ సెటైర్లు

Jagan-Telugu Film Industry: తెలుగు సినీ పరిశ్రమ బతకడానికి ఏపీ ప్రభుత్వం సహకరించాలి. ఆ సహకారం ఎన్ని రకాలుగా ఉండాలన్నదానిపై మొత్తం 17 రకాల అజెండాతో సినీ ప్రముఖులు వెళ్లారు. దానిపై చర్చలు జరిగాయి. ప్రభుత్వం నుంచీ సానుకూల సంకేతాలు వచ్చాయి.

RGV:  'మెగా బెగ్గింగ్ చూసి హర్ట్ అయ్యా'.. అర్థరాత్రి చిరుపై ఆర్జీవీ సెటైర్లు
Chiru Rgv
Ram Naramaneni
|

Updated on: Feb 11, 2022 | 9:39 AM

Share

Tollywood: ఏపీ గవర్నమెంట్, టాలీవుడ్‌కు మధ్య వార్‌కు శుభం కార్డు పడినట్లే అనిపిస్తుంది. గురువారం రోజున తెలుగు బడా స్టార్స్.. సీఎం జగన్‌(Cm Jagan)తో భేటీ అయి చర్చలు జరిపారు. పరస్పర ప్రయోజనాలు. అటు ఏపీ(Andhra Pradesh)కి ఉండాలి.. ఇటు తెలుగు సినీ పరిశ్రమకూ ఉండాలి అన్న సారాంశం అటు సీఎం, ఇటు ఫిల్మ్ స్టార్స్ మాటలను బట్టి తెలుస్తోంది.  రాబోయే 2 వారాల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కూడా అధికారిక ఉత్తర్వులు వచ్చే చాన్స్ ఉంది. అయితే ఏపీలో సినిమా టికెట్ రేట్ల ఇష్యూపై అగ్రెసీవ్ కామెంట్స్ చేస్తూ వస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి ఎంటరయ్యారు. గురువారం సీఎం జగన్‌తో సినీ పెద్దల మీటింగ్‌పై అర్థరాత్రి ట్వీట్స్ మోత మోగించారు. ఈ మీటింగ్ తాలూకు వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఆర్జీవీ.. చిరంజీవి టార్గెట్‌గా సెటైర్లు గుప్పించారు. ‘ఓ మెగా ఫ్యాన్‌గా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా బాధ పడ్డా’ అని ట్వీట్ చేశారు.

Rgv Tweets

అంతేకాదు చిరు తమ్ముడు పవన్ ఎప్పుడూ ఇలా బెగ్ చెయ్యడని.. అందుకే అతను ఎక్కువ పాపులర్‌ అంటూ మరో ట్వీట్‌లో రాసుకొచ్చారు. అందుకే ఈ తరహా విషయాల్లో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఇష్టపడరంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  అయితే చిరంజీవిని ట్యాగ్ చేస్తూ.. ఆయనపై సెటైర్లు వేస్తూ వరస ట్వీట్లు వేసిన వర్మ..  కొద్దిసేపటి తర్వాత తిరిగి వాటని రిమూవ్ చేయడంతో ఆయన తీరుపై జనాల్లో చర్చలు నడుస్తున్నాయి.