Ajith’s Valimai : తల ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి వస్తుందనుకున్న వలిమై కూడా వెనకడుగేసింది..
ఓ వైపు కరోనా.. మరో వైపు కొత్త వేరియంట్ .. జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.
Ajith’s Valimai : ఓ వైపు కరోనా.. మరో వైపు కొత్త వేరియంట్ .. జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండక్కి రావాల్సన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే భారీ సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ తమ రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా కూడా వెనక్కి తగ్గింది. తమిళ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వలిమై సినిమా రిలీజ్ వాయిదా పడింది. భారీ బడ్జెట్ తో బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఈ మేరకు సన్నాహాలు కూడా మొదలు పెట్టేశారు. కానీ ఇప్పుడు అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది చిత్రయూనిట్.
చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూతబడుతూ వస్తున్నాయి. తాజాగా తమిళనాడులో కూడా థియేటర్లను మూసివేయాలనే నిర్ణయం జరిగిపోవడంతో, ఈ సినిమా విడుదలను వాయిదా వేయక తప్పలేదు.మా సినిమాను మీరు థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయలేము త్వరలో పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమాను విడుదల చేస్తాం. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తాం అని ప్రకటించారు మేకర్స్. ముందుగా ఈ సినిమాను తెలుగులో బలం పేరుతో రిలీజ్ చేయాలని చూసారు. కానీ ఆ తర్వాత వాలిమై అనే టైటిల్ తోనే పోస్టర్లను విడుదల చేశారు. ఈ సినిమాలో టాలీవుడ్ కుర్ర హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Chiranjeevi: మెగాస్టార్‌తో రొమాన్స్‌కు రెడీ అయిన ముద్దుగుమ్మ.. బాబీ సినిమాలో హీరోయిన్‌గా..
Arjun Kapoor: ఆంటీతో ప్రేమ అన్న నెటిజన్స్‌కు అర్జున్ స్ట్రాంగ్ రిప్లై.. ఎవరి జీవితాలు వారివి..జీవించాలి.. జీవించనివ్వాలి అంటూ..
Nabha Natesh: క్యూట్ ఎక్ప్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘నభా నటేష్’..లేటెస్ట్ ఫొటోస్..