Ravi Teja: ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్న మాస్ రాజా.. ఏ సినిమాలోనంటే..

మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Ravi Teja: ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్న మాస్ రాజా.. ఏ సినిమాలోనంటే..
Raviteja
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 06, 2022 | 6:51 PM

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది.  ఖిలాడి సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ సినిమాతోపాటే త్రినాద్ రావ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ధమాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలతోపాటు  క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మతో ఓ సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. ఈ కాంబినేషన్ లో రాబోతున్న సూపర్ క్రేజీ మూవీ రావణాసుర. ఈ భారీ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. దీపా‌వళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. రావణాసురలో క‌థానాయ‌కుడు ప‌ది డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపిస్తుండ‌డం విశేషం.

రావణాసురలో ర‌వితేజ లాయ‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా సంక్రాంతి పండక్కి జ‌న‌వ‌రి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. రావణాసుర చిత్రానికి శ్రీకాంత్ విస్సా ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ అందించారు. స్టైలిష్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రంలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించ‌నున్నారు.  ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముగ్గురు భామలతో రవితేజ రొమాన్స్ చేయనున్నాడట. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా మేఘా ఆకాష్.. నటించనున్నారు. అలాగే ఈ సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్ గా `జాంబిరెడ్డి` ఫేమ్ దక్షా నాగర్కర్ కనిపించనుంది. ఇక రావణాసుర సినిమాలో రవితేజ విలక్షణమైన పాత్రలో కనిపిస్తాడని పోస్టర్‌లోనే తెలిసిపోతోంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందే ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ  ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Chiranjeevi: మెగాస్టార్‌తో రొమాన్స్‌కు రెడీ అయిన ముద్దుగుమ్మ.. బాబీ సినిమాలో హీరోయిన్‌గా..

Arjun Kapoor: ఆంటీతో ప్రేమ అన్న నెటిజన్స్‌కు అర్జున్ స్ట్రాంగ్ రిప్లై.. ఎవరి జీవితాలు వారివి..జీవించాలి.. జీవించనివ్వాలి అంటూ..

Nabha Natesh: క్యూట్ ఎక్ప్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘నభా నటేష్’..లేటెస్ట్ ఫొటోస్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?