Ajith Kumar: రేసింగ్ కోసం కొత్త మెర్సిడెస్ కారు కొన్న అజిత్.. ధర తెలిస్తే షాకే..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో హిట్లు ఖాతాలో వేసుకున్న అజిత్.. మరోవైపు రేసింగ్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పలు రేసింగ్స్‌లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది వరుస హిట్ సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు అజిత్. విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో సక్సెస్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అటు కార్ రేసింగ్‌లోకి అడుగుపెట్టారు. గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల తర్వాత కారు రేసింగ్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా అజిత్ మెర్సిడెస్-ఎఎమ్‌జి జిటి3 రేసింగ్ కారును కొనుగోలు చేశాడు. ఆ కారుతో అజిత్ ఉన్న ఫోటోస్, వీడియోస్ ఇప్పుడ్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ కారు ఫీచర్స్, ధర గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
అజిత్ కొత్త మెర్సిడెస్-AMG GT3 రేసింగ్ కారు ధరకు సంబంధించి సమాచారం ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం కొత్త మెర్సిడెస్-AMG GT3 రేసింగ్ కారు ధర రూ.10 కోట్లకు పైగా ఉంటుందని టాక్. ఈ కారు రేసింగ్ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అజిత్.. GT4 యూరోపియన్ సిరీస్ మూడవ రౌండ్ కోసం బెల్జియంకు వెళ్లారు.
అజిత్ కుమార్ చివరిసారిగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం అజిత్ AK46 చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం చివర్లో అది బయటకు వచ్చే అవకాశం ఉంది.
AMG GT3 – looking at a new beginning ??#AjithKumar #AjithKumarRacing pic.twitter.com/MT8pzMUx08
— Ajithkumar Racing (@Akracingoffl) July 3, 2025
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..




