Pushpa Movie: పుష్ప సినిమాలో బన్నీ చెల్లెలుగా ఐశ్వర్య రాజేష్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది.

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సంబంధించి రకరకాల న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా రావణ్ సినిమా లైన్స్‌లోనే తెరకెక్కుతోంది. రష్మికతో పాటు మరో హీరోయిన్ కూడా సినిమాలో ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఈ క్రేజీ మూవీలో బన్నీ సిస్టర్ రోల్ ప్లే చేస్తున్నారన్న వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ వార్తలపై ఐశ్వర్య రాజేష్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. పుష్ప సినిమాలో ఐశ్వర్య నటిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదని రూమర్స్‌కు చెక్ పెట్టేసింది. దీంతో సినిమా కంటెంట్ మీద ప్రచారంలో ఉన్న వార్తలు కూడా ఫేకే అయి ఉంటాయంటున్నారు అల్లు అర్జున్ ఆర్మీ. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ కాస్త నెగెటివ్ టచ్ ఉన్న హీరో క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. బన్నీ లుక్ ఊర మాస్ గా ఉంది.
ప్రస్తుతం కోవిడ్ కారణంగా స్లోగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ఇప్పుడు కంప్లీట్‌గా బ్రేక్ పడింది. బన్నీకి పాజిటివ్ రావటంతో 20 రోజుల పాటు షూటింగ్‌ను వాయిదా వేశారు మేకర్స్.. ఇప్పటికే ఆగస్టు 13న రిలీజ్ అంటూ గ్రాండ్‌గా ఎనౌన్స్ చేసిన మూవీ టీమ్.. ఇన్ టైమ్‌లో వర్క్ కంప్లీట్ చేసేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :




