Aishwarya Rai: ఐశ్వర్య కూతురు వినయానికి ఫిదా.. స్టార్ హీరో కనిపించగానే ఆరాధ్య ఏం చేసిందో తెలుసా? వీడియో

దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన సైమా- 2024 అవార్డుల వేడుకలో అందాల తార ఐశ్వర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో ఐశ్వర్య రాయ్ ఉత్తమ నటి (క్రిటిక్స్ )గా పురస్కారం అందుకుంది. పొన్నియిన్ సెల్వన్‌ సినిమాలో ఆమె అద్భుత నటనకు ప్రతీకగా ఈ పురస్కారం దక్కింది.

Aishwarya Rai: ఐశ్వర్య కూతురు వినయానికి ఫిదా.. స్టార్ హీరో కనిపించగానే ఆరాధ్య ఏం చేసిందో తెలుసా? వీడియో
Aishwarya Rai Bachchan
Follow us
Basha Shek

|

Updated on: Sep 19, 2024 | 11:07 AM

దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన సైమా- 2024 అవార్డుల వేడుకలో అందాల తార ఐశ్వర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో ఐశ్వర్య రాయ్ ఉత్తమ నటి (క్రిటిక్స్ )గా పురస్కారం అందుకుంది. పొన్నియిన్ సెల్వన్‌ సినిమాలో ఆమె అద్భుత నటనకు ప్రతీకగా ఈ పురస్కారం దక్కింది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్‌తో కలిసి వేదికపై అవార్డును అందుకుంది ఐశ్వర్య. ఈ మధుర క్షణాలను తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించి మురిసిపోయింది ఐశ్వర్య గారాల పట్టి ఆరాధ్య. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. ఇప్పుడు ఆరాధ్యకు సంబంధించిన మరొక వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఐశ్వర్య కూతురిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సైమా అవార్డుల ప్రదానోత్సవానికి పలువురు స్టార్ హీరోలు హాజరయ్యారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌ ఈ కార్యక్రమంలో తళక్కుమన్నారు. శివరాజ్ కుమార్, విక్రమ్ కలిసి మాట్లాడుకుంటుండగా.. అక్కడకు సమీపంలో ఐశ్వర్యరాయ్ వారి దగ్గరకు వచ్చింది. శివన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చి క్షేమ సమాచారాలు అడిగింది. అలాగే అక్కడే ఉన్న తన కుమార్తె ను శివరాజ్‌కుమార్‌ను పరిచయం చేసింది. ఈ సందర్భంగా ఆరాధ్య సూపర్ స్టార్ శివన్న కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంది. హీరో కూడా ఐశ్వర్య కూతురికి దీవెనలు అందించి, విషెస్ తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

కాగా ఈ మధ్యన ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా వెంట ఆరాధ్య కూడా కనిపిస్తుంది. గతంలో తన తల్లితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.అలా ఇప్పుడు ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన కూతురు ఆరాధ్యతో కలిసి దుబాయ్‌లో జరిగిన SIIMA 2024 ఈవెంట్‌కి హాజరైంది. ఈసారి తల్లీ కూతుళ్లు ఇద్దరూ రెడ్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు.

శివన్న కాళ్లకు నమస్కరిస్తోన్న ఆరాధ్య బచ్చన్.. వీడియో

ప్రస్తుతం సైమాలో ఐశ్వర్య, ఆరాధ్యల ఫొటోలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఐష్ కూతురు ఆరాధ్య బచ్చన్ మునుపటి కంటే క్యూట్ గా ఉందని క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇక శివరాజ్‌కుమార్ విషయానికి వస్తే.. ఆయన కేవలం కన్నడ సినిమాకే పరిమితం కాలేదు. జైలర్ సినిమాతో పాన్ ఇండియా నటుడిగా మారిపోయాడు.

సైమా వేడుకల్లో ఐష్, ఆరాధ్య..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేపలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లిన మహిళ..అక్కడ కనిపించిన ఫిష్
చేపలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లిన మహిళ..అక్కడ కనిపించిన ఫిష్
ఆ జాతరలో ఫ్లెక్సీలే హైసెక్యూరిటీ.. ఎందుకో తెలిస్తే వావ్ అంటారు
ఆ జాతరలో ఫ్లెక్సీలే హైసెక్యూరిటీ.. ఎందుకో తెలిస్తే వావ్ అంటారు
మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కారణమిదే
మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కారణమిదే
బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు.. ఆకలిచావులతో మృతి
బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు.. ఆకలిచావులతో మృతి
అంతుచిక్కని మిస్టరీ వ్యాధి.. 14 మంది చిన్నారులు మృత్యువాత..
అంతుచిక్కని మిస్టరీ వ్యాధి.. 14 మంది చిన్నారులు మృత్యువాత..
భారత్‌కు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపలు
భారత్‌కు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపలు
ఐటీబీపీ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
ఐటీబీపీ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
వాచ్‌మెన్‌గా 165 జీతం.. ఇప్పుడు రూ.కోట్లు తీసుకునే స్టార్ యాక్టర్
వాచ్‌మెన్‌గా 165 జీతం.. ఇప్పుడు రూ.కోట్లు తీసుకునే స్టార్ యాక్టర్
ముంచుకొస్తున్న సముద్ర ముప్పు.. ముందస్తు హెచ్చరికలు జారీ
ముంచుకొస్తున్న సముద్ర ముప్పు.. ముందస్తు హెచ్చరికలు జారీ
ఏం తెలివిరా బాబు.. భలే స్మార్ట్ గా లూటీ చేశారు..! ఖాకీలే షాక్..
ఏం తెలివిరా బాబు.. భలే స్మార్ట్ గా లూటీ చేశారు..! ఖాకీలే షాక్..