Pushpa 2: రిలీజ్‌కు ముందే రికార్డులు మడతపెట్టేస్తున్న పుష్ప 2.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన సినిమా
పుష్ప 1 విజయం తర్వాత, అల్లు అర్జున్ 'పాన్ ఇండియా' సూపర్ స్టార్ అయ్యాడు. ఏకంగా జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు 'పుష్ప 2'లో ఏం జరగబోతోంది.? ఇది తెలుసుకోవాలని యావత్ భారతదేశం ఉత్సుకతతో ఉంది. పుష్ప 2 డిసెంబర్ 5, 2024న థియేటర్లలో విడుదల కానుంది.
పాన్ ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకునే రోజు వచ్చేసింది. ఎప్పటి నుంచో ప్రేక్షుకులు, ముఖ్యంగా అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమా ఈ రోజు ( డిసెంబర్ 4 సాయంత్రం ) ప్రీమియర్స్ అలాగే డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ కు జోడీగా ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా కనిపించనుంది. పుష్ప పార్ట్ 1లో సమంత దుమ్మురేపే స్పెషల్ సాంగ్ చేసినట్టే.., పుష్ప 2లో కూడా అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉండనుంది. ఈ సాంగ్ లో బన్నీతో కలిసి డాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్టెప్పులేయనుంది. అయితే ఈసారి సమంత కాదు శ్రీలీల ఈ డాన్స్ ను ప్రదర్శించబోతోంది. అల్లు అర్జున్ ‘పుష్ప’ కోసం ఐదేళ్లు వెచ్చించారు. పుష్ప 2 విడుదలకు ముందే నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
ఇది కూడా చదవండి :Allu Arjun : పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ట్వీట్
అడ్వాన్స్ బుకింగ్స్ లోనే దమ్ము ఎంతో చూపింది ఈ సినిమా.. ఏకంగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వంద కోట్లు వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ లో పుష్ప 2 సినిమా రూ. 100కోట్లు మార్క్ ను అందుకుంది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. పుష్ప 1 ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఇక ఇప్పుడు పుష్ప 2తో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయనున్నారు అల్లు అర్జున్. ఇక పుష్ప 2లో రావు రమేష్, జగపతిబాబు, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప 1 కు మించి ఈ సినిమాలో యాక్షన్స్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. పుష్ప 2 సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమాను కూడా అదే రేంజ్ లో ప్రమోషన్ చేశారు.
ఇది కూడా చదవండి :Nargis fakhri : మాజీ బాయ్ ఫ్రెండ్‌ను హత్య చేసిన స్టార్ హీరోయిన్ సోదరి.. అరెస్ట్ చేసిన పోలీసులు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.