HIT 2 Day 1 collection: సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో.. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫస్ట్ డే కలెక్షన్స్
నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది.

యంగ్ హీరో అడవి శేష్ నటించి హిట్ 2 సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదులైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులనుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శైలేష్ కొలను ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా భారీ ఓపినింగ్స్ వచ్చాయని తెలుస్తోంది. శేష్ కెరీర్ లో హైయెస్ట్ ఓపినింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా హిట్ 2 నిలిచింది. ఇక ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే..
నైజాం 1.90 కోట్లు, సీడెడ్ 0.35 కోట్లు, ఉత్తరాంధ్ర 0.52 కోట్లు, ఈస్ట్ 0.29 కోట్లు, వెస్ట్ 0.19 కోట్లు, గుంటూరు 0.32 కోట్లు,కృష్ణా 0.25 కోట్లు, నెల్లూరు 0.14 కోట్లు, ఏపీ – తెలంగాణ (టోటల్) 3.96 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.43 కోట్లు వసూల్ చేసింది ఈ సినిమా అలాగే ఓవర్సీస్ 1.95కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 6.34 కోట్ల షేర్ రాబట్టింది ట్రేడ్ వర్గాలు చేస్తున్నాయి.
ఇక ఈ సినిమాకి రిలీజ్ కు ముందు రూ.12.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. హిట్ 2 బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.13.25 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.6.34 కోట్ల షేర్ ను రాబట్టిందని తెలుస్తోంది.







