Adipurush Movie: ఆదిపురుష్ టీమ్‌ను వదలని కష్టాలు.. తాజాగా యూనిట్‌కు మరో షాక్
ఆదిపురుష్ టీమ్‌ను కష్టాలు వదిపెట్టడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేసిన యూనిట్‌కు మరో షాక్ తగిలింది. తెలంగాణలోనూ...

ఆదిపురుష్ టీమ్‌ను కష్టాలు వదిపెట్టడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేసిన యూనిట్‌కు మరో షాక్ తగిలింది. తెలంగాణలోనూ లాక్ డౌన్ ప్రకటించటంతో మూవీ టీమ్ డైలామాలో పడింది. సినిమా ప్రారంభమైన రోజే ఫైర్ యాక్సిడెంట్ కావటంతో షూటింగ్ డిలే అయ్యింది. తరువాత ఆర్టిస్ట్‌ల డేట్స్ కుదరక నెమ్మదిగా షూటింగ్ చేశారు. షెడ్యూల్ కాస్త గాడిలో పడుతుందన్న సమయానికి ముంబైలో లాక్ డౌన్ పెట్టేశారు. ప్రభాస్ సహా మూవీ టీమ్ అంతా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. అదే టైమ్‌లో హైదరాబాద్‌లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు మూవీ టీమ్. రామోజీ ఫిలిం సిటీలో సెట్ కూడా రెడీ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా లాక్ డౌన్ పెట్టేయటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
మైథలాజికల్ మూవీ కావటంతో భారీగా క్రూ వర్క్ చేయాల్సి ఉంటుంది. లాక్ డౌన్ టైమ్‌లో అంత మందితో షూటింగ్ చేయటం కష్టమన్న ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అందుకే సిచ్యుయేషన్ సెట్ అయ్యే వరకు వెయిట్ చేయటమే బెటర్ అని ఫీల్ అవుతున్నారట. మరి ఈ వెయిటింగ్.. ఎంతవరకు సాగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ..
Also Read: మరోసారి బాలయ్యపై ప్రగ్యా క్రేజీ కామెంట్స్.. ఆయన రేంజ్ వేరంటూ