Telugu Directors: లాక్ డౌన్ సమయంలో మన డైరెక్టర్లు ఏం చేస్తున్నారో తెలుసా..?

చేతినిండా పనిలేక ఖాళీగా కూర్చుని ఉండాలంటే ఎవరికి మాత్రం ఇష్టముంటుంది చెప్పండి..! క్రియేటివ్ మైండ్స్ కైతే అస్సలు కుదరదు...

Telugu Directors: లాక్ డౌన్ సమయంలో మన డైరెక్టర్లు ఏం చేస్తున్నారో తెలుసా..?
Tollywood
Follow us

|

Updated on: May 15, 2021 | 10:54 PM

Telugu Directors:

చేతినిండా పనిలేక ఖాళీగా కూర్చుని ఉండాలంటే ఎవరికి మాత్రం ఇష్టముంటుంది చెప్పండి..! క్రియేటివ్ మైండ్స్ కైతే అస్సలు కుదరదు. సినిమా అనే షిప్ ని అత్యంత చాకచక్యంగా ముందుకి నడిపే కెప్టెన్లకయితే.. లాక్ డౌన్ అనేది ఒక బందిఖానా లాంటిదే. అందుకే.. ఈ టైంలోనే థింక్ స్మార్ట్ అంటూ ఇంటిలిజెంట్ గా అడుగులేస్తున్నారు డైరెక్టర్లు. మరి… ఈ స్మార్ట్ థింకింగ్ అనేది అందరికీ కుదురుతుందా…? వీళ్లంతా నా వాళ్లు అంటూ నలుగురు స్టార్ డైరెక్టర్లతో గ్రూప్ ఫోటో తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. వారిలో ఆచార్య డైరెక్టర్ కొరటాలను మినహాయిస్తే.. మిగతా ముగ్గురికీ ఇప్పుడు లాక్ డౌన్ విధించినంత పనయిందట. లూసిఫర్ సబ్జెక్టుని మెగాస్టార్ మనసుకు నచ్చినట్లు రిపేర్లు చేయడంతోనే సరిపోయింది మోహన్ రాజాకు. చిరు లాక్ చేసుకున్న మరో ఇద్దరు డైరెక్టర్స్.. మెహర్ రమేష్, బాబీ.. మెగాస్టార్ కోసం రాసిపెట్టుకున్న కథల మీద కసరత్తుతోనే టైం పాస్ చేస్తున్నారు. చిరూతో సినిమా చేయడం కంటే గొప్ప అచీవ్మెంట్ ఇంకేం ఉంటుంది? అందుకే ఆ గోల్డెన్ డేట్స్ కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నలుగురైదుగురు కెప్టెన్లను ఎంగేజ్ లో పెట్టేశారు. ఇప్పుడు సాగర్ కె. చంద్రతో చేస్తున్న మల్టీస్టారర్ ని అటుంచితే పవన్ కి కమిట్మెంట్ ఇచ్చిన మిగతా డైరెక్టర్లలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పరిస్థితి. పవన్ తో హరిహర వీరమల్లు చేస్తూనే… వైష్ణవ్-రకుల్ కాంబోలో ఒక లో బడ్జెట్ మూవీ ఫినిష్ చేసి చేతిలో పెట్టుకున్నారు క్రిష్ జాగర్లమూడి.

పవర్ స్టార్ తో మరోసారి గబ్బర్ సింగ్ లా గర్జించాలన్న ప్లాన్ తో మైత్రివాళ్లకు మాటిచ్చారు హరీష్ శంకర్. పవన్ మీదుండే అంతులేని అభిమానం.. ఆయన్ను మరో హీరో వైపు చూడకుండా ఆపేసింది. మా బాస్ కోసం ఎన్నాళ్లయినా వెయిట్ చేస్తా అనేది హరీష్ మాట. పవన్ కళ్యాణ్ 29th మూవీ కోసం రామ్ తాళ్ళూరితో డీల్ ఓకే చేసుకున్న సురేందర్ రెడ్డి మాత్రం.. ఆలోగా.. అఖిల్ కి బ్రేక్ ఇచ్చొస్తా అని సెలవు పెట్టేశారు. బన్నీతో ఐకాన్ మూవీ చేయాలని మూడేళ్ళ పాటు వెయిట్ చేసిన వేణు శ్రీరామ్.. ఆలోగా పవన్ తో టచ్ లోకొచ్చి మరో సర్ ప్రైజ్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. అటు… తారక్ కెరీర్ లో థర్టీయత్ మూవీ కోసం గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసి.. డేట్స్ కోసం వెయిట్ చేసీచేసి.. చివరకు మహేష్ క్యాంపులో చేరిపోయారు త్రివిక్రమ్. ప్రభాస్ తో పాన్ వరల్డ్ మూవీ చేస్తానంటూ శపథం చేసిన నాగీ కూడా ఖాళీగా ఏమీ లేరు. జాతిరత్నాలతో ప్రొడ్యూసర్ గా హిట్టు కొట్టేశారు. వెంకీ అండ్ వరుణ్ తో ఎఫ్3 చేస్తూనే… ఫ్రెండ్ కిచ్చిన మాట కోసం గాలి సంపత్ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు అనిల్ రావిపూడి. మరొకరితో సినిమా చెయ్యలేక.. ఒప్పుకున్నది మొదలుపెట్టే ఛాన్స్ రాక.. కెరీర్ ని కరగబెట్టుకునే వారు కొందరైతే.. తెలివిగా ఆలోచించి తలోదారి చూసుకొనేవారు మరికొందరు.