Prabhas: రామ్‏లీలా మైదానంలో రావణ దహనానికి ప్రభాస్.. పదితలల అన్యాయాన్ని అణచివేయడానికి వచ్చేస్తున్న ఆదిపురుష్.. 

రామ్ లీలా మైదానంలో జరిగే రావణ దహనానికి ప్రభాస్ హాజరు కాబోతున్నారంటూ గతంలోనే వార్తలు వినిపించాయి. ఇటీవల ఆదిపురుష్ టీజర్ అప్డేట్ ఇస్తూ.. ఇదే విషయాన్ని కన్ఫార్మ్ చేశారు డైరెక్టర్ ఓంరౌత్.

Prabhas: రామ్‏లీలా మైదానంలో రావణ దహనానికి ప్రభాస్.. పదితలల అన్యాయాన్ని అణచివేయడానికి వచ్చేస్తున్న ఆదిపురుష్.. 
Prabhas
Follow us

|

Updated on: Oct 03, 2022 | 11:25 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ప్రతి ఏడాది దసరా పండగా సందర్భంగా ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రావణ దహనం కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభాస్‏ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ చేతుల మీదుగా ఏడాది రావణ దహనం కార్యక్రమం ప్రారంభించనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ అయోధ్యలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం అయోధ్యలో నిర్వహించిన ఆదిపురుష్ టీజర్ లాంచ్ వేడుకలో డార్లింగ్ పాల్గోన్నారు. రామ్ లీలా మైదానంలో జరిగే రావణ దహనానికి ప్రభాస్ హాజరు కాబోతున్నారంటూ గతంలోనే వార్తలు వినిపించాయి. ఇటీవల ఆదిపురుష్ టీజర్ అప్డేట్ ఇస్తూ.. ఇదే విషయాన్ని కన్ఫార్మ్ చేశారు డైరెక్టర్ ఓంరౌత్.

రామ్ లీలా మైదానంలో జరిగే రావణ దహన కార్యక్రమానికి తనతోపాటు హీరో ప్రభాస్ సైతం పాల్గోననున్నారని ట్వీట్ చేశారు డైరెక్టర్ ఓంరౌత్. అక్టోబర్ 5న ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది రామ్ లీలా మైదానంలో జరిగే రావణ దహన కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ అయోధ్యలోని రామ మందిరం రూపంలో మండపాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్‏తో మండపాన్ని నిర్మించడం ఆనవాయితీ.

రామాయణ ఇతిహసం ఆధారంగా డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించారు. అలాగే కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీఖాన్ రావణుడుగా కనిపించనున్నారు. ఆదివారం విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వేయికళ్లతో ఈ మూ

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.