Mahesh Babu: అటు ప్రభాస్ కోసం.. ఇప్పుడు మహేష్ కోసం తెలుగులోకి వస్తోన్న మలయాళీ స్టార్ .. త్రివిక్రమ్ సినిమాలో ఆ హీరో స్పెషల్ రోల్..
ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అలాగే ఇందులో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అలాగే ఇందులో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు నెట్టింట పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మాట వినిపిస్తుంది.
లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ అతిథి పాత్రలో నటించనున్నారట. ఇప్పటికే ఆయనతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరుపుతుందని.. అటు పృథ్వీరాజ్ కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రంలోనూ పృథ్వీరాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రం ఇప్పటివరకు జక్కన్న తెరకెక్కించిన చిత్రాలకు మించి ఉండనున్నట్లు ఇటీవల రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.