AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ఆదిపురుష్‏లో హనుమంతుడిగా నటించింది ఎవరో తెలుసా ?.. మూవీలో అతనే కీలకం..

రాముడిగా ప్రభాస్ కనిపించగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. అయితే వీరి ముగ్గురి గురించి ప్రేక్షకుల గతంలోనే తెలుసు.

Adipurush: ఆదిపురుష్‏లో హనుమంతుడిగా నటించింది ఎవరో తెలుసా ?.. మూవీలో అతనే కీలకం..
Adipurush
Rajitha Chanti
|

Updated on: Oct 03, 2022 | 10:20 AM

Share

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం అయోధ్యలోని సరయు నది తీరాన గ్రాండ్‏గా విడుదల చేశారు. రిలీజ్ అయిన కాసేపట్లోనే ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. అయితే వీరి ముగ్గురి గురించి ప్రేక్షకుల గతంలోనే తెలుసు. అలాగే వీరంతా సుపరిచితం కావడంతో ఆడియన్స్ సైతం వీరి నటన పై అవగాహన ఉంది. అయితే ఆదిపురుష్ టీజర్‏లో హనుమంతుడు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. ఇప్పటివరకు కేవలం ప్రధాన పాత్రలను మాత్రమే పరిచయం చేసిన డైరెక్టర్ ఓంరౌత్.. హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది చెప్పలేదు. ఇక తాజాగా విడుదలైన టీజర్‏లో హనుమంతుడిగా కనిపించింది ఎవరా ? అంటూ నెట్టింట చర్చ మొదలైంది.

హనుమంతుడిగా కనిపించిన అతడి పేరు దేవదత్త గజానన్ నాగే. మరాఠీ సీరియల్స్.. సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా జై మల్హర్ సీరియల్లో లార్డ్ కండోబా పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాగే వీర్ శివాజీ, దేవయాని, బాజీరావ్ మస్తానీ చిత్రాల్లో నటించారు. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇక లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ మూవీలో అతని పాత్ర మరింత కీలకంగా ఉండనుందట.

డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన తాన్హాజీ.. ది అన్ సంగ్ వారియర్ చిత్రంలో సూర్యాజీ మలుసరే పాత్రలో నటించారు. తనకు హనుమంతుడితో ప్రత్యేక అనుబంధం ఉందని.. 17 ఏళ్ల వయసులో తాను వర్కవుట్ చేయడం ప్రారంభించి.. తన తొలి జిమ్ సెంటర్ కు హనుమాన్ వ్యాయమశాల అని పేరు పెట్టినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దేవదత్తా. ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుడిగా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. తన పాత్ర కోసం శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ సినిమా ద్వారా, ప్రభాస్, సన్నీ సింగ్, కృతి సనన్ తనకు మంచి స్నేహితులు అయ్యారని చెప్పుకొచ్చారు దేవదత్తా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మష్రూమ్ దొండకాయ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్
మష్రూమ్ దొండకాయ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్
ఈత కొడితే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఈత కొడితే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
'ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ'
'ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ'
ఆ హీరో నన్ను తిట్టాడు.. ఆరోజు చాలా గొడవ జరిగింది..
ఆ హీరో నన్ను తిట్టాడు.. ఆరోజు చాలా గొడవ జరిగింది..
ఉల్లికాడల ఎగ్ పులుసు.. ఒకసారి వండి తింటే ఉంటాది నా సామిరంగా..
ఉల్లికాడల ఎగ్ పులుసు.. ఒకసారి వండి తింటే ఉంటాది నా సామిరంగా..
ఇంట్లో ఈ దిశలో పొరపాటున కూడా చెత్త వేయకండి.. దరిద్రం దశావతారమే..
ఇంట్లో ఈ దిశలో పొరపాటున కూడా చెత్త వేయకండి.. దరిద్రం దశావతారమే..
అప్పట్లో హీరోయిన్.. కట్ చేస్తే ఇప్పుడు అందాల విలన్..
అప్పట్లో హీరోయిన్.. కట్ చేస్తే ఇప్పుడు అందాల విలన్..
లేత మటన్ Vs ముదురు మటన్.. వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
లేత మటన్ Vs ముదురు మటన్.. వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ డేట్ ఫిక్స్?
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ డేట్ ఫిక్స్?
తియ్యటి నీళ్లున్నకొబ్బరి బొండాన్ని గుర్తించడం ఎలా?
తియ్యటి నీళ్లున్నకొబ్బరి బొండాన్ని గుర్తించడం ఎలా?