RRR Movie: తెలుగు సినిమా పవర్ అంటే ఇదే.. లాస్ ఏంజెల్స్‌లో ఆర్ఆర్ఆర్ రచ్చ.. ఫస్ట్ షోకు ఏకంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయంటే..
అక్కడి థియేటర్లో అభిమానుల తాకిడి.. స్క్రీన్ ముందు ఆర్ఆర్ఆర్ పాటలకు స్టెప్పులేసిన వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక కేవలం ఫస్ట్ షోకే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది ఆర్ఆర్ఆర్.
డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రభంజనం విదేశాల్లో కొనసాగుతుంది. ప్రస్తుతం బియాండ్ ఫెస్ట్‌లో భాగంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్లోగల చైనీస్ థియేటర్లో ఆర్ఆర్ఆర్ ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చూసేందుకు భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. అంతేకాకుండా.. మూవీ అనంతరం రాజమౌళితో నిర్వహించిన క్వశ్చన్ సెషన్ కోసం కూడా తెగ ఆసక్తి చూపించారు. అక్కడి థియేటర్లో అభిమానుల తాకిడి.. స్క్రీన్ ముందు ఆర్ఆర్ఆర్ పాటలకు స్టెప్పులేసిన వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక కేవలం ఫస్ట్ షోకే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది ఆర్ఆర్ఆర్.
లేటేస్ట్ టాక్ ప్రకారం.. ఈ థియేటర్లో కేవలం ఒకే ప్రదర్శనకు సుమారు రూ. 17 లక్షలకు పైగా వసూలు చేసిందట. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇటీవల నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో బియాండ్ ఫెస్ట్‌లో భాగంగా అమెరికాలోని నగరాల్లో మళ్లీ విడుదల చేశారు.
థియేటర్‌లోని 932 సీట్లు 20 నిమిషాల్లో అమ్ముడయ్యాయని డెడ్‌లైన్ నివేదిక పేర్కొంది. సింగిల్ షో నుండి, చిత్రం $21,000 వసూలు చేసింది. థియేటర్లో డైరెక్టర్ రాజమౌళికి ఏకంగా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు అభిమానులు.
Your adoration and applause towards my heroes, my film and me were enormous. THANK YOU USA ???????? pic.twitter.com/YH0hPL1q3H
— rajamouli ss (@ssrajamouli) October 1, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.