Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్‏లో అందరి కళ్లు ఆ చిన్నదాని పైనే.. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టరా ?..

థియేటర్లలో ఈ మూవీ చూస్తు్న్న ప్రేక్షకుల కళ్లు ఒక అమ్మాయిపై ఆగిపోయాయి. సినిమా మొత్తంలో ఆ చిన్నది స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే అందర్నీ తనవైపు ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందామా.

Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్‏లో అందరి కళ్లు ఆ చిన్నదాని పైనే.. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టరా ?..
Ponniyin Selvan Child Artis
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 03, 2022 | 12:18 PM

భారీ తారగణంతో పాన్ ఇండియా డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్‏గా వచ్చిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్, త్రిష, చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళీ భాషలలో విడుదలైంది. మొదటి రోజే సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ రచయిత కల్కి రచించిన ఈ పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు డైరెక్టర్ మణి. విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 230 కోట్లకు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. అయితే థియేటర్లలో ఈ మూవీ చూస్తు్న్న ప్రేక్షకుల కళ్లు ఒక అమ్మాయిపై ఆగిపోయాయి. సినిమా మొత్తంలో ఆ చిన్నది స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే అందర్నీ తనవైపు ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందామా.

పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య నందిని చిన్ననాటి పాత్రలో కనిపించిన ఆ అమ్మాయి పేరు సారా అర్జున్. విక్రమ్ తన ఫ్లాష్ బ్యాక్ వివరిస్తున్నప్పుడు సారా కేవలం కొన్ని సెకన్ల పాటు కనిపించింది. ఆ కొద్ది సమయంలోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిన్నది మరెవరో కాదు.. గతంలో విక్రమ్ చియాన్ నటించిన నాన్న సినిమాలో అతని కూతురుగా నటించిన సారా. అంతేకాదు.. బాలనటిగా రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్, జై హో, ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు హిందీలో 404 సినిమాలో కథానాయికగా నటిస్తూ బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఇప్పటివరకు చైల్డ్ ఆర్టీస్ట్ గా నటించిన సారా.. ఆకస్మా్త్తుగా పొన్నియిన్ సెల్వన్ సినిమాలో టీనేజ్ యువతిగా కనిపించి.. ఒక్కసారిగా ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది. దీంతో ఈ చిన్నది త్వరలోనే వెండితెరపై అగ్రకథానాయికగా రాబోతుందంటున్నారు ఆడియన్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.